పల్లె.. ప్రభవించేలా..

ABN , First Publish Date - 2021-06-18T05:46:17+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి పనులపై అధికార యంత్రాంగం దృష్టిసారించింది.

పల్లె.. ప్రభవించేలా..

అసంపూర్తి పనులపై దృష్టి

పల్లెనిద్ర, తనిఖీలకు అధికారుల సన్నాహాలు

‘గ్రామీణ ప్రాంతాలు, నగరాల అభివృద్ధికి నిధులు ఇస్తున్నాం.. కొందరి నిర్లక్ష్యం కారణంగా ఆశించిన మేర  పనులు జరగడంలేదు. ఇది సరైంది కాదు. అన్ని జిల్లాల్లో ఆకస్మిక తనిఖీలు చేస్తా. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు’ ఇటీవల అన్ని జిల్లాల అధికారులతో జరిగిన సమీక్షలో ముఖ్యమంత్రి చేసిన హెచ్చరిక. 

ఖమ్మం కలెక్టరేట్‌/కొత్తగూడెం కలెక్టరేట్‌, జూన్‌ 17: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి పనులపై అధికార యంత్రాంగం దృష్టిసారించింది. పల్లెలు, నగరాలను ఆహ్లాదంగా తీర్చిదిద్దేందుకు ప్రకృతి వనాలు, డంపింగ్‌యార్డులు, సెగ్రిగేషన్‌షెడ్లు వైకుంఠధామాలను అన్ని గ్రామపంచాయతీల్లో నిర్మాణాలు చేపట్టారు. ఈ క్రమంలో ఖమ్మం జిల్లాలో 589, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 479 గ్రామపంచాయతీల్లో ఈ పనులు జోరుగా సాగుతున్నాయి. పనులకు పరిపాలన అనుమతులు మంజూరవగా.. నరేగా నిధులతో పంచాయతీరాజ్‌శాఖ, గ్రామపంచాయతీల ఆధ్వర్యంలో ఈ పనులను చేపట్టారు. ఖమ్మం ప్రతీ గ్రామ పంచాయతీలో వైకుంఠధామాలు, డంపిండ్‌యార్డులు, పల్లెప్రకృతి వనాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇవి ప్రగతిలోనే ఉన్నాయి. డంపింగ్‌ యార్డులు, కంపోస్ట్‌ షెడ్లు 90శాతం పూర్తికావచ్చాయి. వైకుంఠధామాలు మాత్రం ఇంకా 25 వరకు ప్రగతిలో ఉన్నాయి. అయితే వీటికి బిల్లులు సకాలంలో ప్రభుత్వం మంజూరి చేయకపోవడం కారణంగా సర్పంచులు ముందుకురావడంలేదని ఆరోపిస్తున్నారు. అయితే వీటిని వారంలోగా పూర్తిచేయాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ గురువారం ఉమ్మడి ఖమ్మం జిల్లాల అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆదేశించారు. ఖమ్మం జిల్లాలో కలెక్టర్‌ ఆర్వీకర్ణన్‌ ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్‌, జడ్పీ సీఈవో డీఆర్డీవో, డీపీవో ఆధ్వర్యంలో బృందాలు గ్రామాలను తనిఖీ చేయనున్నాయి. జిల్లాలో డీఎల్పీవోలు, ఎంపీవోలు, గ్రామపంచాయతీ కార్యద ర్శులు, దాదాపు ఒక్కో గ్రామంలో ఒకరోజు పల్లెనిద్ర చేసేలా సన్నాహాలు చేస్తున్నారు.   

సిద్ధంగా ఉన్నాం : వాసిరెడ్డి ప్రభాకర్‌రావు, పంచాయతీ అధికారి, ఖమ్మం జిల్లా 

జిల్లాలో పల్లెప్రగతి పనులు దాదాపు పూర్తికావస్తున్నాయి. ప్రగతిలో ఉన్న పనులను కూడా పదిరోజుల్లో పూర్తిచేసేలా ప్రణాళికలను సిద్దం చేస్తున్నాం. సీజనల్‌ వ్యాదుల పట్ల, పల్లెప్రగతి పనుల పట్ల ప్రజలకు పూర్తి అవగాహన కల్పించడానికి సన్నాహాలు చేస్తున్నాం. పారిశుద్యం నిర్వహణ, సైడ్‌ డ్రెయిన్ల పరిశుబ్రత, క్లోరినేషన్‌ కార్యక్రమాలపై ఇప్పటికే పంచాయతీ సిబ్బందిని అప్రమత్తం చేశాం. పల్లెనిద్రకు కూడా ప్రణాళికలను సిద్దం చేస్తున్నాం.


ఖమ్మం జిల్లాలో పల్లెప్రగతి పనులు నివేదికలు ఇలా 

-------------------------------------------------------------------------

పనులు పంచాయతీలు పూర్తయినవి        అసంపూర్తి నిధులు(లక్షల్లో)

-------------------------------------------------------------------------

డంపింగ్‌యార్డులు 589 584         5

వైకుంఠధామాలు 589 564         25 7203.00

కంపోస్ట్‌ షెడ్లు         589 584         5 1494.27

డ్రెయింగ్‌ ఫ్లాట్‌ఫారాలు 589 436         153 36.39


భద్రాద్రి జిల్లాలో..

పల్లెప్రగతి కార్యక్రమ లక్ష్యానికి తగినట్లు నిధులు విడుదల చేయడంలో పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోది. ఫలితంగా పంచాయితీ స్థాయిలో అధికారులు, ప్రజాప్రతినిధులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ అప్పుల ఊబిలోకి వెళుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 479 గ్రామపంచాయితీల్లో పల్లెప్రగతి పనులను నిధుల సమస్య అడ్డంకిగా మారింది. పంచాయితీలకు రావాల్సిన నిధులు సకాలంలో మంజూరవుతున్నా.. వాటిని తీసుకోవడంలో సాంకేతిక లోపాలు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలో పల్లెపకృతి వనాలు, వైకుంఠ ధామాలు, డంపింగ్‌ యార్డులు, రైతువేధికల నిర్మాణాలకు సంబంధించిన బిలుల్లో జాప్యం జరుగుతోందని అధికారులే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా సుమారు రూ 145.25కోట్లు కేటాయించారు. ఇప్పటి వరకు రూ.70కోట్లు చెల్లించారు. మొత్తం 67రైతు వేదికలకు రూ14.74 కోట్లు కేటాయించి ఇప్పటి వరకు రూ.7.72కోట్లు చెల్లించారు. 481 స్మశానవాటికలకు రూ.59.40 కోట్లు కేటాయించి రూ.41.64కోట్లు చెల్లించారు. 480 డంపింగ్‌యార్డులకు రూ.11.58కోట్లు కేటాయించి రూ.10.45కోట్లు చెల్లించారు. 1280 పల్లె పకృతి వనాలకు రూ.59.63కోట్లు కేటాయించారు. రూ.10.19కోట్లు చెల్లించారు.



Updated Date - 2021-06-18T05:46:17+05:30 IST