South Africaపై T20 సిరీస్ నుంచి KL Rahul ఔట్.. కెప్టెన్‌గా రిషబ్ పంత్

ABN , First Publish Date - 2022-06-09T00:47:09+05:30 IST

స్వదేశంలో దక్షిణాఫ్రికా(South Africa)పై టీ20 సిరీస్‌లో టీమిండియా(India) కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని భావించిన కేఎల్ రాహుల్ గాయం కారణంగా టోర్నీకి దూరమయ్యాడు.

South Africaపై T20 సిరీస్ నుంచి KL Rahul ఔట్.. కెప్టెన్‌గా రిషబ్ పంత్

ముంబై : స్వదేశంలో దక్షిణాఫ్రికా(South Africa)పై టీ20 సిరీస్‌లో టీమిండియా(India) కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని భావించిన కేఎల్ రాహుల్(KL Rahul) గాయం కారణంగా అనూహ్యంగా సిరీస్‌కు దూరమయ్యాడు. ఈ మేరకు బీసీసీఐ(BCCI) బుధవారం ట్వీట్ చేసింది. రాహుల్ స్థానంలో రిషబ్ పంత్(Rishab pant) కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని ప్రకటించింది. హార్ధిక్ పాండ్యా(Hardi pandya) వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడని పేర్కొంది. ఈ మేరకు ఆలిండియా సీనియర్ సెలక్షన్ కమిటీ నిర్ణయించిందని తెలిపింది. మరోవైపు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్(Kuldeep yadav) కూడా గాయం కారణంగా సిరీస్‌కు దూరమైనట్టు పేర్కొంది. కేఎల్ రాహుల్‌కు కుడి గజ్జ గాయంతో ఇబ్బందిపడుతున్నాడు. ఇక కాగా నిన్న సాయంత్రం నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కుల్దీప్ యాదవ్ కుతిచేతికి గాయమైందని బీసీసీఐ వివరించింది. అయితే కేఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్ స్థానాల్లో ఇతర ఆటగాళ్లను ఎంపిక చేసినట్టు పేర్కొనలేదు. రాహుల్, కుల్దీప్‌ ఇద్దరూ ఎన్‌సీఏ(నేషనల్ క్రికెట్ అకాడమీ) వద్ద రిపోర్ట్ చేయాలి. అక్కడ మెడికల్ బృందం ఆటగాళ్లను పరిస్థితిని పరిశీలిస్తుంది. తదుపరి సిరీస్, భవిష్యత్ సిరీస్‌లలో ఆడించేది లేదదీ నిర్ణయిస్తుందని ప్రకటనలో స్పష్టం చేసింది.


మార్పుల తర్వాత టీ20 జట్టు

రిషబ్ పంత్(కెప్టెన్, వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా(వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, దీపక్ హుడా, శ్రేయస్ అయ్యర్, దినేష్ కార్తీక్(వికెట్ కీపర్), వెంకటేష్ అయ్యర్, యజువేంద్ర చాహల్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అవేష్ ఖాన్, అర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్.

Updated Date - 2022-06-09T00:47:09+05:30 IST