రాణించిన రాహుల్‌

ABN , First Publish Date - 2021-08-06T09:42:00+05:30 IST

ఇంగ్లండ్‌తో ఆరంభ టెస్ట్‌లో టీమిండియా టాప్‌ రాణించినా మిడిలార్డర్‌ విఫలమైంది. కేఎల్‌ రాహుల్‌ (57 బ్యాటింగ్‌) అర్ధ సెంచరీతో పాటు రోహిత్‌ శర్మ (36) రాణించడంతో రెండో రోజైన గురువారం వర్షంతో...

రాణించిన రాహుల్‌

  • భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ 125/4 
  • ఇంగ్లండ్‌తో మొదటి టెస్ట్‌

నాటింగ్‌హామ్‌: ఇంగ్లండ్‌తో ఆరంభ టెస్ట్‌లో టీమిండియా టాప్‌ రాణించినా మిడిలార్డర్‌ విఫలమైంది. కేఎల్‌ రాహుల్‌ (57 బ్యాటింగ్‌) అర్ధ సెంచరీతో పాటు రోహిత్‌ శర్మ (36) రాణించడంతో రెండో రోజైన గురువారం వర్షంతో ఆట నిలిపివేసే సమయానికి భారత్‌ 46.4 ఓవర్లలో 125/4 స్కోరు చేసింది. ఓవర్‌నైట్‌ స్కోరు 21/0తో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించింది. చటేశ్వర్‌ పుజార (4), కెప్టెన్‌ కోహ్లీ (0), అజింక్యా రహానె (5) విఫలమయ్యారు. జేమ్స్‌ అండర్సన్‌ 2, రాబిన్‌సన్‌ ఒక వికెట్‌ తీశారు. ప్రస్తుతం టీమిండియా 58 పరుగుల వెనుకంజలో ఉంది. 47వ ఓవర్‌లో భారత్‌ 125/4 స్కోరు వద్ద వర్షంతో ఆటను నిలిపి వేశారు. రెండు గంటలపాటు కురిసిన వర్షంతో అవుట్‌ ఫీల్డ్‌ చిత్తడిగా మారడంతో అంపైర్లు చివరి సెషన్‌ను రద్దు చేశారు. అంతకుముందు ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 183 రన్స్‌ చేసింది. 


కుంబ్లేను సమం చేసిన అండర్సన్‌: ఇంగ్లండ్‌ పేసర్‌ అండర్సన్‌ భారత దిగ్గజ స్పిన్నర్‌ అనిల్‌ కుంబ్లే అత్యధిక టెస్ట్‌ వికెట్ల రికార్డును సమం చేశాడు. అండర్సన్‌ 163 ఇన్నింగ్స్‌లో 619 వికెట్లు పడగొట్టి టెస్ట్‌ల్లో అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా కుంబ్లేతో కలిసి సంయుక్తంగా నిలిచాడు. 


ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 183 ఆలౌట్‌; భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: రోహిత్‌ (సి) కర్రాన్‌ (బి) రాబిన్‌సన్‌ 36; కేఎల్‌ రాహుల్‌ (బ్యాటింగ్‌) 57; పుజార (సి) బట్లర్‌ (బి) అండర్సన్‌ 4; కోహ్లీ (సి) బట్లర్‌ (బి) అండర్సన్‌ 0; రహానె (రనౌట్‌) 5; పంత్‌ (బ్యాటింగ్‌) 7; ఎక్స్‌ట్రాలు: 16; మొత్తం: 46.4 ఓవర్లలో 125/4; వికెట్ల పతనం: 1-97, 2-104, 3-104, 4-112; బౌలింగ్‌: అండర్సన్‌ 13.4-7-15-2, బ్రాడ్‌ 11-1-45-0, రాబిన్‌సన్‌ 15-5-32-1, సామ్‌ కర్రాన్‌ 7-1-25-0.


Updated Date - 2021-08-06T09:42:00+05:30 IST