IPL 2022: LSG ఓడినా సరికొత్త రికార్డు సృష్టించిన కేఎల్‌ రాహుల్‌.. ఆ ఇద్దరి రికార్డును తిరగరాసి..

ABN , First Publish Date - 2022-05-27T03:15:26+05:30 IST

ఐపీఎల్‌‌లో లక్నో సూపర్‌ జెయిం‍ట్స్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ అరుదైన రికార్డు సృష్టించాడు. నాలుగు ఐపీఎల్ సీజన్లలో 600 పైగా పరుగులు చేసిన తొలి ఆటగాడిగా..

IPL 2022: LSG ఓడినా సరికొత్త రికార్డు సృష్టించిన కేఎల్‌ రాహుల్‌.. ఆ ఇద్దరి రికార్డును తిరగరాసి..

ఐపీఎల్‌‌లో లక్నో సూపర్‌ జెయిం‍ట్స్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ అరుదైన రికార్డు సృష్టించాడు. నాలుగు ఐపీఎల్ సీజన్లలో 600 పైగా పరుగులు చేసిన తొలి ఆటగాడిగా రాహుల్ ఘనత సాధించాడు. ఐపీఎల్‌ 2022లో రాహుల్‌ 616 పరుగులు సాధించాడు. అంతకు ముందు క్రిస్ గేల్, డేవిడ్ వార్నర్ మూడు సీజన్లలో 600 పైగా పరుగులు సాధించారు. ఇక ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ఆర్‌సీబీ చేతిలో 4 పరుగుల తేడాతో లక్నో సూపర్‌ జెయిం‍ట్స్‌ ఓటమి పాలైంది. దీంతో ఐపీఎల్‌ నుంచి లక్నో నిష్క్రమించింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆర్‌సీబీ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది.



రజత్‌ పటిదార్‌ సెంచరీతో చెలరేగిపోయాడు. కేవలం 54 బంతుల్లో 112 పరుగులు సాధించాడు. దినేశ్‌ కార్తీక్‌ 37 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. దీంతో బెంగళూరు 208 పరుగులు చేసింది. భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన లక్నో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 193 పరుగులకే పరిమితమైంది. లక్నో బ్యాటర్లలో కేఎల్‌ రాహుల్‌ 79 రన్స్‌, దీపక్‌ హుడా 45 పరుగులు చేశారు. మిగత బ్యాట్స్‌మెన్ ఎవరూ కూడా రాణించకపోవడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 193 పరుగులు మాత్రమే చేసింది.

Updated Date - 2022-05-27T03:15:26+05:30 IST