లక్నో కెప్టెన్‌గా కేఎల్ రాహుల్.. అందుకు తెలివితో పనిలేదన్న గౌతం గంభీర్

ABN , First Publish Date - 2022-01-22T22:35:21+05:30 IST

ఐపీఎల్ నయా ఫ్రాంచైజీ లక్నో తన కెప్టెన్‌గా టీమిండియా ఓపెనర్ కేఎల్‌ రాహుల్‌ను తీసుకోవడంపై లక్నో మెంటార్ గౌతం..

లక్నో కెప్టెన్‌గా కేఎల్ రాహుల్.. అందుకు తెలివితో పనిలేదన్న గౌతం గంభీర్

లక్నో: ఐపీఎల్ నయా ఫ్రాంచైజీ లక్నో తమ కెప్టెన్‌గా టీమిండియా ఓపెనర్ కేఎల్‌ రాహుల్‌ను తీసుకోవడంపై లక్నో మెంటార్ గౌతం గంభీర్ స్పందించాడు. రాహుల్‌ను కెప్టెన్‌గా ఎంచుకునేందుకు పెద్దగా బుర్ర ఉపయోగించాల్సిన పనిలేదన్నాడు. ఐపీఎల్‌లో అతడి ట్రాక్ రికార్డు అద్భుతంగా ఉందని, అతడికి దగ్గరలో ఎవరూ లేరని అన్నాడు.


లక్నో జట్టును సొంతం చేసుకున్న ఆర్‌పీఎస్‌జీ గ్రూపు శుక్రవారం తమ కెప్టెన్‌గా కేఎల్‌ రాహుల్‌ను ప్రకటించింది. ఇందుకోసం అతడితో రూ.17 కోట్లకు ఒప్పందం కుదుర్చుకుంది. పంజాబ్ కింగ్స్‌ను రెండు సీజన్లలో నడిపించిన రాహుల్‌ను ఐపీఎల్ 2022 వేలానికి ముందు పంజాబ్ వదిలించుకుంది. రాహుల్‌కు ఐపీఎల్‌లో మంచి రికార్డు ఉంది. 94 మ్యాచుల్లో 47కు పైగా సగటుతో 3,273 పరుగులు చేశాడు. అంతేకాదు, నాలుగు సీజన్ల పాటు ప్రతి సీజన్‌లోను 550కిపైగా పరుగులు చేశాడు. 


రాహుల్‌‌ను లక్నో జట్టు కెప్టెన్‌గా తీసుకోవడంపై గంభీర్ మాట్లాడుతూ.. అతడు మంచి బ్యాటరే కాకుండా మంచి నాయకుడు కూడా అని ప్రశంసించాడు. అతడు మూడు పనులు చేయగలడని.. బ్యాటింగ్ ప్రారంభిస్తాడని, వికెట్లు కాపాడుకోవడంతోపాటు అసాధారణ బ్యాటర్ అని కొనియాడాడు. పంజాబ్, ఇతర ఫ్రాంచైజీలకు ఆడినప్పుడు అద్భుతంగా రాణించాడని.. ఈ మూడు విషయాలకు మించి ఏ బ్యాటర్ అయినా ఇంకేమి ఇవ్వగలడని గంభీర్ ప్రశించాడు. 


 రాహుల్‌ను కెప్టెన్‌గా తీసుకున్న లక్నో.. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినిస్‌ను 9.2 కోట్లకు సొంతం చేసుకుంది. అలాగే, ఆన్‌క్యాప్‌డ్ ఇండియన్ ప్లేయర్, లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్‌ను రూ. 4 కోట్లకు తీసుకుంది. ఈ ముగ్గురూ గతంలో పంజాబ్‌కు ఆడారు.   


Updated Date - 2022-01-22T22:35:21+05:30 IST