విండీస్‌తో టీ20 సిరీస్‌కు కేఎల్‌ రాహుల్‌ దూరం?

ABN , First Publish Date - 2022-07-28T10:28:45+05:30 IST

వెస్టిండీ్‌సతో టీ20 సిరీ్‌సకు కూడా భారత బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌ దూరమయ్యే అవకాశాలున్నాయి. గతవారం కొవిడ్‌ బారినపడిన రాహుల్‌ ఐసోలేషన్‌ నుంచి బయటకు

విండీస్‌తో టీ20 సిరీస్‌కు కేఎల్‌ రాహుల్‌ దూరం?

న్యూఢిల్లీ: వెస్టిండీ్‌సతో టీ20 సిరీ్‌సకు కూడా భారత బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌ దూరమయ్యే అవకాశాలున్నాయి. గతవారం కొవిడ్‌ బారినపడిన రాహుల్‌ ఐసోలేషన్‌ నుంచి బయటకు వచ్చాడు. కానీ, పూర్తిగా కోలుకోవడానికి అతడిని మరో వారంపాటు విశ్రాంతి అవసరమని బీసీసీఐ వైద్య బృందం సూచించింది. హెర్నియా ఆపరేషన్‌ తర్వాత జాతీయ క్రికెట్‌ అకాడమీలో రాహుల్‌ కోలుకుంటున్నాడు. విండీ్‌సతో వన్డే సిరీస్‌కు పక్కనబెట్టినా.. ఈ నెల 29 నుంచి జరిగే ఐదు టీ20ల సిరీ్‌సకు అతడిని ఎంపిక చేశారు. కానీ, కొవిడ్‌ బారినపడడంతో మొత్తంగా టూర్‌కే దూరమవుతాడని బోర్డు వర్గాలు చెబుతున్నాయి. 

Updated Date - 2022-07-28T10:28:45+05:30 IST