అబుదాబి: ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించిన కోల్‌కతాకు ఎదురుదెబ్బ తగిలింది. స్లో ఓవర్ రేట్ కారణంగా ఆ జట్టు కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌కు ఐపీఎల్ రూ. 24 లక్షల జరిమానా విధించింది. ఈ సీజన్లో కోల్‌కతా ఇలా నెమ్మదిగా బౌలింగ్ వేయడం ఇది రెండోసారని, ఐపీఎల్ నియమావళిని ఉల్లంఘించినందుకు గాను కోల్‌కతా కెప్టెన్ మోర్గాన్‌కు రూ. 24 లక్షల జరిమానా విధించినట్టు ఐపీఎల్ తెలిపింది. అలాగే, మిగతా జట్టు సభ్యులు ఒక్కొక్కరికి వారి మ్యాచ్ ఫీజు నుంచి రూ. 6 లక్షలు (25 శాతం) జరిమానా విధిస్తున్నట్టు పేర్కొంది.