మహిళకు అరుదైన శస్త్రచికిత్స

ABN , First Publish Date - 2022-08-11T05:54:22+05:30 IST

కాకినాడ క్రైం, ఆగస్టు 10: ప్రాణాపాయంలో ఉన్న ఓ మహిళకు కాకినాడ వెంకటచలపతి హాస్పటల్‌ వైద్యులు అరుదైన శస్త్రచికిత్స నిర్వహించారు. ప్రముఖ ప్లాస్టిక్‌ సర్జన్‌ డాక్టర్‌ కర్ణాకుల విష్ణుమూర్తి బుధవారం విలేకరులకు ఈ వివరాలు వెల్లడించారు. ఏలేశ్వరం మండలం సిరిపురానికి చెందిన చవల నిర్మల (43) ఏడాదిగా కడుపుఉబ్బరంతో బాధపడుతుండేది. 5నెలలుగా ఉదరభాగం పైకి ఎగదన్ని బాగా పెరిగింది. స్థానికంగా పలు ఆస్పత్రుల్లో తిరిగినా మార్పు లేకపోవడంతో వెంకటచలపతి హాస్పటల్‌లో పేదలకు ఉచితంగా వైద్యం చేస్తారని తెలుసుకుని గత

మహిళకు అరుదైన శస్త్రచికిత్స
వివరాలు వెల్లడిస్తున్న విష్ణుమూర్తి

కాకినాడ క్రైం, ఆగస్టు 10: ప్రాణాపాయంలో ఉన్న ఓ మహిళకు కాకినాడ వెంకటచలపతి హాస్పటల్‌ వైద్యులు అరుదైన శస్త్రచికిత్స నిర్వహించారు. ప్రముఖ ప్లాస్టిక్‌ సర్జన్‌ డాక్టర్‌ కర్ణాకుల విష్ణుమూర్తి బుధవారం విలేకరులకు ఈ వివరాలు వెల్లడించారు. ఏలేశ్వరం మండలం సిరిపురానికి చెందిన చవల నిర్మల (43) ఏడాదిగా కడుపుఉబ్బరంతో బాధపడుతుండేది. 5నెలలుగా ఉదరభాగం పైకి ఎగదన్ని బాగా పెరిగింది. స్థానికంగా పలు ఆస్పత్రుల్లో తిరిగినా మార్పు లేకపోవడంతో వెంకటచలపతి హాస్పటల్‌లో పేదలకు ఉచితంగా వైద్యం చేస్తారని తెలుసుకుని గతనెల 15న సంప్రదించింది. అక్కడ వైద్యపరీక్షలు నిర్వహించి గర్భసంచికి చేరువుగా ఉండే ఓవరీలో పెద్ద నీటి గడ్డ ఏర్పడినట్లు గుర్తించారు. మరుసటిరోజునే లెఫ్ట్‌ ఓవరీస్‌ సిస్టక్టమీ శస్త్రచికిత్స విజయవంతంగా చేసి 20లీటర్ల నీటిని తొలగించారు. ఈ సమస్య లక్షమందిలో ఒకరికి అరుదుగా వస్తుందని డాక్టర్‌ విష్ణుమూర్తి తెలిపారు. ఈ శస్త్రచికిత్సకు బయట రూ.4లక్షల వరకు ఖర్చువుతుందని, తమ ఆస్పత్రిలో ఉచితంగా చికిత్స చేశామని ఆయన చెప్పారు.



Updated Date - 2022-08-11T05:54:22+05:30 IST