ఇంటింటికీ రక్షిత మంచినీరు

ABN , First Publish Date - 2022-08-17T06:01:09+05:30 IST

కరప, ఆగస్టు 16: జలజీవన్‌ మిషన్‌ పథకం ద్వారా ఇంటింటికీ రక్షిత మంచినీరు అందించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని ఎమ్మెల్యే కురసాల కన్నబాబు పేర్కొన్నారు. మండలంలోని జి.బావారం గ్రామంలో మంగళవారం ఆయన రూ.23లక్షలతో నిర్మించనున్న ఇంటింటికీ కుళాయి

ఇంటింటికీ రక్షిత మంచినీరు

కరప, ఆగస్టు 16: జలజీవన్‌ మిషన్‌ పథకం ద్వారా ఇంటింటికీ రక్షిత మంచినీరు అందించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని ఎమ్మెల్యే కురసాల కన్నబాబు పేర్కొన్నారు. మండలంలోని జి.బావారం గ్రామంలో మంగళవారం ఆయన రూ.23లక్షలతో నిర్మించనున్న ఇంటింటికీ కుళాయి కనెక్షన్‌ పథకానికి ఆయన శంకుస్థాపన చేశారు. సిరిపురంలో పర్యటించి రూ.25.20 లక్షలతో చేపట్టే రక్షిత మంచినీటి పథకానికి భూమిపూజచేశారు. అలాగే గ్రామం లో నిర్మాణం పూర్తిచేసుకున్న సచివాలయ భవనాన్ని ప్రారంభించారు. పాతర్లగడ్డలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమాల్లో ఎంపీపీ పెంకే శ్రీలక్ష్మిసత్తిబాబు, జడ్పీటీసీ యాళ్ల సుబ్బారావు,  వైసీపీ సీనియర్‌ నాయకుడు కురసాల సత్యనారాయణ, సర్పంచ్‌లు రొక్కాల గణిరాజు, నున్న సుజాత, నాగిరెడ్డి ఏసుబాబు, వైసీపీ మండలాధ్యక్షుడు చింతా ఈశ్వరరావు, ఎంపీడీవో కర్రె స్వప్న, పంచాయతీరాజ్‌శాఖ ఏఈ శైలజ పాల్గొన్నారు.

Updated Date - 2022-08-17T06:01:09+05:30 IST