దూసుకొచ్చిన మృత్యువు

ABN , First Publish Date - 2021-05-15T05:43:20+05:30 IST

సర్పవరం జంక్షన్‌, మే 14: మరో ఐదు నెలల్లో ఉద్యోగ విరమణ పొందుతాను... శేష జీవితాన్ని కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతానంటూ తరచూ సహచర పోలీసులతో చెప్పేవారు. ఇంతలోనే మృత్యువు లారీ రూపంలో వచ్చి అనంతలోకాలకు తీసుకెళ్లింది. ఆయనే

దూసుకొచ్చిన మృత్యువు

హెడ్‌ కానిస్టేబుల్‌ సత్యనారాయణ, 

హోంగార్డు రెడ్డి మరణంతో కన్నీరుమున్నీరైన సహచరులు

సర్పవరం జంక్షన్‌, మే 14: మరో ఐదు నెలల్లో ఉద్యోగ విరమణ పొందుతాను... శేష జీవితాన్ని  కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతానంటూ తరచూ సహచర పోలీసులతో చెప్పేవారు. ఇంతలోనే మృత్యువు లారీ రూపంలో వచ్చి అనంతలోకాలకు తీసుకెళ్లింది. ఆయనే తిమ్మాపురం పోలీస్‌ స్టేషన్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ మొండి సత్యనారాయణ. తెల్లవారితే శుక్రవారం అనగా సామర్లకోట ఏడీబీ రోడ్డులోని ఉండూరు జంక్షన్‌ వద్ద జరిగిన జరిగిన ఘోర ప్రమాదంలో ఆయన అశువులుబాశారు. 2019 నుంచి తిమ్మాపురంలో పని చేస్తున్న సత్యనారాయణ  ఎప్పుడూ అందరితో కలుపుగోలుగా ఉండేవారని, అధికారులు అప్పగించిన పనిని ఎంతో నిబద్ధతతో పని చేసేవారని సహచరులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే ప్రమాదంలో మృతి చెందిన హోంగార్డు రెడ్డి రెండు నెలల క్రితమే కాకినాడ నుంచి తిమ్మాపురం వచ్చాడని, జీపు డ్రైవర్‌గా విశేష సేవలందించాడని వారు గుర్తు చేసుకున్నారు.  కొవిడ్‌ వ్యాక్సిన్‌ వాహనానికి ఎస్కార్ట్‌గా వెళ్లిన వారు ప్రమాదంలో మృతి చెందడం కలచివేసిందన్నారు. కాకినాడ జీజీహెచ్‌ మార్చురీ వద్ద పోలీసుల మృతదేహాలకు ఏఎస్పీ కరణం కుమార్‌, డీఎస్పీ భీమారావు, కాకినాడ రూరల్‌ సీఐ ఎ.మురళీకృష్ణ నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రభుత్వం తరపున బెనిఫిట్స్‌ అందేలా చూస్తామని చెప్పారు.

Updated Date - 2021-05-15T05:43:20+05:30 IST