మున్సిపల్‌ ఎన్నికల్లో టీడీపీ గెలుపే లక్ష్యం

ABN , First Publish Date - 2021-02-26T05:28:49+05:30 IST

పిఠాపురం, ఫిబ్రవరి 25: మున్సిపల్‌ ఎన్నికల్లో టీడీపీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ఆ పార్టీ కాకినాడ పార్లమెంటరీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్‌ పిలుపునిచ్చారు. పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో గురువారం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎ్‌సఎన్‌ వర్మ ఆధ్వర్యాన పిఠాపురం మున్సిపాలిటీ, గొల్లప్రోలు

మున్సిపల్‌ ఎన్నికల్లో టీడీపీ గెలుపే లక్ష్యం
సమావేశంలో మాట్లాడుతున్న జ్యోతుల నవీన్‌

పంచాయతీ ఎన్నికల్లో సమష్టిగా మంచి ఫలితాలు  

కాకినాడ పార్లమెంటరీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్‌ 

వైసీపీకి భయపడాల్సిన పనిలేదు: మాజీ ఎమ్మెల్యే వర్మ 

పిఠాపురం, ఫిబ్రవరి 25: మున్సిపల్‌ ఎన్నికల్లో టీడీపీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ఆ పార్టీ కాకినాడ పార్లమెంటరీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్‌ పిలుపునిచ్చారు. పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో గురువారం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎ్‌సఎన్‌ వర్మ ఆధ్వర్యాన పిఠాపురం మున్సిపాలిటీ, గొల్లప్రోలు నగర పంచాయతీల పరిధిలోని వార్డుల అభ్యర్థులతో నిర్వహించిన సమావేశంలో నవీన్‌ మాట్లాడారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికార వైసీపీ నేతలు ఎన్ని బెదిరింపులకు పాల్పడినా, కేసులు పెట్టినా, కక్ష సాధింపు చర్యలకు పాల్పడినా సమష్టిగా ఎదుర్కొని మంచి ఫలితాలు సాధించామని పేర్కొ న్నారు. గెలుపు కోసం వారు తొక్కని అడ్డదారి లేదని విమర్శించారు. మున్సి పల్‌ ఎన్నికల్లోనూ అధికార పార్టీ నేతలు బెదిరింపులకు పాల్పడుతున్నారని, పలుచోట్ల కేసులు పెడుతున్నారని నవీన్‌ తెలిపారు. ఇటువంటి వాటిని తిప్పికొడదామన్నారు. వైసీపీ పాలనలో జరిగిన అభివృద్ధి శూన్యమని, నేతలు మాత్రం పట్టాల ముసుగులో కోట్లు దిగమింగారని విమర్శించారు. ఇంటింటికీ రేషన్‌ పేరుతో పేదలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఇందులో వాహనాలు కేటాయించేందుకు ఒక్కో దానికి రూ.30వేల వంతున వసూళ్లకు పాల్పడ్డారని ఆరోపించారు. ఇసుక దొరక్క అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారన్నారు. టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధి, వైసీపీ పాలనలో జరుగుతున్న కక్ష సాధింపులను ప్రజలకు వివరించి ఓట్లు అడగాలని నవీన్‌ తెలిపారు. మాజీ ఎమ్మెల్యే వర్మ మాట్లాడుతూ టీడీపీ అభ్యర్థులను కేసుల పేరుతో బెదిరించి పోటీ నుంచి తప్పించాలని అధికార పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇటువంటి వాటికి భయపడాల్సిన పనిలేదని స్పష్టం చేశారు. పార్టీ అందరికీ అండగా ఉంటుందని, అభ్యర్థులు నిరంతరం ప్రజల్లో తిరుగుతూ ప్రచారం చేయాలని ఆయన సూచించారు. సమావేశం లో పట్టణ, మండలాధ్యక్షులు రెడ్డెం భాస్కరరావు, గుండ్ర సుబ్బారావు, సకుమళ్ల గంగాధర్‌, ఉలవకాయల దేవేంద్రుడు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-02-26T05:28:49+05:30 IST