నాయకర్‌ ఆశయ సాధనకు కృషి

ABN , First Publish Date - 2021-02-26T05:32:16+05:30 IST

డెయిరీఫారమ్‌ సెంటర్‌ (కాకినాడ), ఫిబ్రవరి 25: ప్రతి విద్యార్థి నాయకర్‌ ఆశయ సాధనకు కృషి చేయాలని ఎంఎ్‌సఎన్‌ ఛారిటీస్‌ సంస్థ చైర్మన్‌, వంశపార్యంపర్య ధర్మకర్త మల్లాడి శివరామ నాయకర్‌ అన్నారు. ఛారిటీస్‌ వ్యవస్థాపకుడు, మహాదాత మల్లాడి సత్యలింగం నాయకర్‌ 106వ వర్ధంతిని గురువా

నాయకర్‌ ఆశయ సాధనకు కృషి
సభలో మాట్లాడుతున్న శివరామ నాయకర్‌

ఎంఎ్‌సఎన్‌ ఛారిటీస్‌ చైర్మన్‌ శివరామ నాయకర్‌

డెయిరీఫారమ్‌ సెంటర్‌ (కాకినాడ), ఫిబ్రవరి 25: ప్రతి విద్యార్థి నాయకర్‌ ఆశయ సాధనకు కృషి చేయాలని ఎంఎ్‌సఎన్‌ ఛారిటీస్‌ సంస్థ చైర్మన్‌, వంశపార్యంపర్య ధర్మకర్త మల్లాడి శివరామ నాయకర్‌ అన్నారు. ఛారిటీస్‌ వ్యవస్థాపకుడు, మహాదాత మల్లాడి సత్యలింగం నాయకర్‌ 106వ వర్ధంతిని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దసంఖ్యలో విద్యార్థులు, ప్రజలు పాల్గొనగా జగన్నాథపురం వీధుల్లో నాయకర్‌ రథం ఊరేగింపు జరిపారు. అనంతరం ఏర్పాటు చేసిన సంస్మరణ సభకు అధ్యక్షత వహించిన కార్యనిర్వహణాధికారి డి.సాయిబాబు మాట్లాడుతూ సంస్థ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ఛారిటీస్‌ విద్యాసంస్థల్లో నాణ్యమైన విద్యను అందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో సంస్థ ధర్మకర్తలు, విద్యాసంస్థల ప్రిన్సిపాల్స్‌, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. 


విద్యా ప్రదాత నాయకర్‌

సర్పవరం జంక్షన్‌: నిరుపేదల విద్య కోసం కష్టించి గడించిన వందలాది భూములను కళాశాలలు, పాఠశాలలకు నాయకర్‌ ధారాదాత్తం చేసి విద్యా ప్రదాతగా నిలిచారని అక్నూ ఎంఎ్‌సఎన్‌ క్యాంపస్‌ ప్రత్యేకాధికారి డాక్టర్‌ ఎం.కమాలాకుమారి తెలిపారు. కాకినాడ రూరల్‌ మండలం తిమ్మాపురం అక్నూఎంఎస్‌ నాయకర్‌ పీజీ క్యాంప్‌సలో స్థలదాత మల్లాడి సత్యలింగం నాయకర్‌ 106వ వర్థంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాకినాడ పరిసర ప్రాంతాల ప్రజలు, విద్యార్థుల కోసం విశేష కృషి చేసిన నాయకర్‌ ఆశయ సాధన కోసం కృషి చేయాలని కోరారు. గొప్ప మానవతా విలువలు కలిగిన మహోన్నత వ్యక్తి నాయకర్‌ అన్నారు. ఇక్కడ విద్యాభ్యాసం చేసిన ఎందరో విద్యార్థులు దేశ, విదేశాల్లో ఉన్నతమైన స్థానాల్లో ఉండటం గర్వకారణంగా ఉందన్నారు. ప్రతీ ఒక్కరూ లక్ష్యాలను నిర్దేశించుకుని దానిని సాధించేందుకు ప్రణాళిక ప్రకారం కృషి చేయాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం నాయకర్‌ మనవడు శివరామ్‌ నాయకర్‌ను ఘనంగా సత్కరించారు. నాయకర్‌ జీవిత చరిత్రను ఎన్‌సూరిబాబు వివరించారు. కార్యక్రమంలో అధ్యాపకులు ఎస్‌.ప్రశాంతిశ్రీ, డాక్టర్‌ టీవీరమణ, డాక్టర్‌ ఎం.సత్యనారాయణ, డాక్టర్‌ వై.ఏసురత్నం పాల్గొన్నారు. 

Updated Date - 2021-02-26T05:32:16+05:30 IST