హెల్త్‌ ఆఫీసర్‌.. ఉండీ లేనట్టు..

ABN , First Publish Date - 2020-12-02T06:26:34+05:30 IST

కార్పొరేషన్‌(కాకినాడ): కాకినాడ నగరంలో జనాభా నాలుగు లక్ష లపైమాటే. ప్రజారోగ్యం, పారిశుధ్యం పర్యవేక్షించాల్సిన వైద్యాధికార్లు అర్హత లేకపోయినా కాకినాడ నగరపాలక సంస్థ హెల్తాఫీసర్లుగా బదిలీలపైవస్తూ గుదిబండగా మారుతున్నారు. అవగాహన రాహిత్య అఽధికారుల పర్యవేక్షణలో

హెల్త్‌ ఆఫీసర్‌.. ఉండీ లేనట్టు..
కాకినాడ నగరపాలక సంస్థ కార్యాలయం

స్మార్ట్‌సిటీలో అర్హతలేని ఇన్‌చార్జులతోనే కాలక్షేపం

కార్పొరేషన్‌(కాకినాడ): కాకినాడ నగరంలో జనాభా నాలుగు లక్ష  లపైమాటే. ప్రజారోగ్యం, పారిశుధ్యం పర్యవేక్షించాల్సిన వైద్యాధికార్లు అర్హత లేకపోయినా కాకినాడ నగరపాలక సంస్థ హెల్తాఫీసర్లుగా బదిలీలపైవస్తూ గుదిబండగా మారుతున్నారు. అవగాహన రాహిత్య అఽధికారుల పర్యవేక్షణలో నగరపాలక సంస్థను అనారోగ్యం వెంటాడుతోంది. హెల్తాఫీసర్‌ల నియామకం విషయంలో పైరవీలతో ఏళ్ల తరబడి ఇదే తంతు కొనసాగుతోంది. పర్మినెంట్‌ హెల్తాఫీసర్‌ను నియమించకుండా కాలయాపన చేస్తూ ఇన్‌చార్జిల పేరుతో అర్హత లేని అధికారులను నియమిస్తున్నారు. పర్యవసానంగా ప్రజల ఆరోగ్యంతో అధికారులు చెలగాటం ఆడుతున్నారు. కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో 50 డివిజన్లు ఉన్నాయి. 35 కిలోమీటర్ల విస్తీర్ణం. స్మార్ట్‌ సిటీ కావడంతో ఐఏఎస్‌ అధికారిని కార్పొరేషన్‌ కమిషనర్‌గా నియమించారు. అయితే అర్హత గల హెల్తాఫీసర్‌ను నియమించలేదు. కార్పొరేషన్‌లో ప్రధాన విభాగమైన ఆరోగ్య విభాగానికి హెల్తాఫీసర్‌ పోస్ట్‌ కీలకమైంది. ఈ పోస్ట్‌లో విధులు నిర్వర్తిచేందుకు ఎంబీబీఎస్‌తోపా టు పీజీ డిప్లమో ఇన్‌ పబ్లిక్‌ హెల్త్‌గాని, పీజీ డిప్లమో ఇన్‌ మాస్టర్‌ డిగ్రీ అండ్‌ పబ్లిక్‌ హెల్త్‌ అర్హతగాని కలిగి ఉండాలి. ఈ అర్హతలు ఉన్నవారినే ప్రభుత్వం హెల్తాఫీసర్‌గా నియమించాలి. అయితే గత కొన్నేళ్లుగా అర్హతలేని వారిని హెల్తాఫీసర్‌గా జిల్లా వైద్యాధికారి కార్యాలయం నుంచి ఇన్‌చార్జి హోదాలో నియమిస్తున్నారు. ఎవరు వచ్చినా ఇక్కడ పని ఒత్తిడి తట్టుకోలేక ఏడాది కూడా చేయకుండానే వె ళ్లిపోతున్న దుస్థితి నెలకొంది. ప్రస్తుతం బాధ్యతలు చేపట్టిన హెల్తాఫీసర్‌కు కూడా పూర్తి స్థాయి అర్హత లేదు. ఇప్పటికైనా పూర్తి అర్హతలు కలిగిన పర్మినెంట్‌ హెల్తాఫీసర్‌ను నియమించాలని కోరుతున్నారు. 

Updated Date - 2020-12-02T06:26:34+05:30 IST