ఐకమత్యమే మహాశక్తి

ABN , First Publish Date - 2021-03-08T05:08:49+05:30 IST

డెయిరీఫారమ్‌సెంటర్‌ (కాకినాడ), మార్చి 7: ఐకమత్యమే మహాశక్తి అని సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి అన్నారు. కోకనాడ డెకరేటర్స్‌ అండ్‌ ఫంక్షన్‌ మెటీరియల్‌ సప్లయిర్స్‌ ఓనర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆదివారం డి కన్వక్షన్‌ హాల్‌లో

ఐకమత్యమే మహాశక్తి

సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి 

డెయిరీఫారమ్‌సెంటర్‌ (కాకినాడ), మార్చి 7: ఐకమత్యమే మహాశక్తి అని సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి అన్నారు. కోకనాడ డెకరేటర్స్‌ అండ్‌ ఫంక్షన్‌ మెటీరియల్‌ సప్లయిర్స్‌ ఓనర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆదివారం డి కన్వక్షన్‌ హాల్‌లో జరిగింది. ముఖ్య అతిథిగా ద్వారంపూడి పాల్గొన్నారు. అసోసియేషన్‌ కమ్యూనిటీ హాల్‌ నిర్మాణానికి సహకారం అందించాలని అధ్యక్షుడు సిరి శ్రీనివాస్‌ కోరగా ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు. తొలుత న్యాయవాది బచ్చు రాజేష్‌ నూతన కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఇటీవల సప్లయిర్స్‌ వర్కర్‌ ఏసు మృతిచెందడంతో అతడి కుటుంబానికి అసోసియేషన్‌ ద్వారా రూ.25 వేలు ఆర్థిక సాయం అందించారు. గోదావరి చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు పెద్ది రత్నాజీ, సోము ప్రసాద్‌ చారిటబుల్‌ ట్రస్టు చైర్మన్‌ సోము ప్రసాద్‌, సంఘం కార్యదర్శి గారపాటి శివ పాల్గొన్నారు.

Updated Date - 2021-03-08T05:08:49+05:30 IST