కార్పొరేటర్ల ఏకతాటి శుభపరిణామం

ABN , First Publish Date - 2021-08-04T05:16:50+05:30 IST

కార్పొరేషన్‌ (కాకినాడ), ఆగస్టు 3: కార్పొరేటర్లు అందరూ సమష్టిగా ఏకతాటిపైకి రావడం శుభపరిణామమని ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. కాకినాడ నగరపాలక సంస్థ రెండో డిప్యూటీ మేయర్‌ ఎన్నిక సందర్భంగా మంగళవారం ఒక హోటల్‌లో నిర్వహించిన

కార్పొరేటర్ల ఏకతాటి శుభపరిణామం
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే ద్వారంపూడి

ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి

కార్పొరేషన్‌ (కాకినాడ), ఆగస్టు 3: కార్పొరేటర్లు అందరూ సమష్టిగా ఏకతాటిపైకి రావడం శుభపరిణామమని ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. కాకినాడ నగరపాలక సంస్థ రెండో  డిప్యూటీ మేయర్‌ ఎన్నిక సందర్భంగా మంగళవారం ఒక హోటల్‌లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. వైసీపీ, టీడీపీ, బీజేపీ, ఇండిపెండెంట్‌ కార్పొరేటర్లు 35 మంది హాజరయ్యారు. ఈ సందర్భంగా ద్వారంపూడి మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అవినీతి కారణంగానే ప్రజలు ఆయనను ఓడించారన్నారు. తాను అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు దాటిందని, ఎక్కడా అవినీతికి పాల్పడలేదన్నారు. తాను అవినీతికి పాల్పడినట్టు నిరూపించే సత్తా కొండబాబుకు ఉంటే ముందుకు రావాలని ఎమ్మెల్యే సవాల్‌ విసిరారు. జగన్నాఽథపురం 3వ బ్రిడ్జి నిర్మాణం ముసుగులో ఆ రోడ్డును ఆయన లేఅవుట్‌ వైపు మళ్లించడం అవినీతికి నిదర్శనమన్నారు. కొండబాబు ఆక్రమించిన స్థలాలకు ఎన్నింటికి పన్నులు కడుతున్నారని ప్రశ్నించారు. తాను కార్పొరేటర్లను బెదిరిస్తే ఇంతమంది ఎందుకు మద్దతుగా నిలిచారని ప్రశ్నించారు. గతంలో గంజాయి, ఇతర మత్తు పదార్థాలు అమ్మే వారి వద్ద నుంచి మామూళ్లు తీసుకునే చరిత్ర కొండబాబుదని విమర్శించారు. కాకినాడలో గంజాయి అమ్మేవారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. కొండబాబు, మేయర్‌ రాజకీయాలు వల్ల కార్పొరేటర్లు నలిగిపోవడం వల్లే అందరూ ఏకతాటిపై వచ్చి వైసీపీకి మద్దతు ఇస్తున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. సీని యర్‌ కార్పొరేటర్‌ చోడిపల్లి సత్యప్రసాద్‌ మాట్లాడుతూ ఎవరి ఒత్తిడి మీద కార్పొరేటర్లు ఇక్కడకు రాలేదన్నారు. 2వ డిప్యూటీ మేయర్‌ ఎన్నిక కోసం కార్పొరేటర్లు అందరూ ఏకతాటిపై వచ్చామని తెలిపారు.

Updated Date - 2021-08-04T05:16:50+05:30 IST