కాకినాడలో కమ్యూనిటీ మరుగుదొడ్ల నిర్మాణాలు

ABN , First Publish Date - 2020-11-25T06:36:09+05:30 IST

కార్పొరేషన్‌ (కాకినాడ), నవంబరు 24: నగరంలో కమ్యూనిటీ మరుగుదొడ్ల నిర్మాణాలను ప్రత్యేకంగా చేపడుతున్నామని అదనపు కమిషనర్‌ సీహెచ్‌ నాగ నరసింహారావు తెలిపారు. 8వ సర్కిల్‌లోని సూర్యనారాయణపురంలో ఏర్పాటు చేసిన కమ్యూనిటీ మరుగుదొడ్లను మంగళవారం ఆయన

కాకినాడలో కమ్యూనిటీ మరుగుదొడ్ల నిర్మాణాలు
మరుగుదొడ్లు పరిశీలిస్తున్న అదనపు కమిషనర్‌

అదనపు కమిషనర్‌ నాగనరసింహారావు 

కార్పొరేషన్‌ (కాకినాడ), నవంబరు 24: నగరంలో కమ్యూనిటీ మరుగుదొడ్ల నిర్మాణాలను ప్రత్యేకంగా చేపడుతున్నామని అదనపు కమిషనర్‌ సీహెచ్‌ నాగ నరసింహారావు తెలిపారు. 8వ సర్కిల్‌లోని సూర్యనారాయణపురంలో ఏర్పాటు చేసిన కమ్యూనిటీ మరుగుదొడ్లను మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సాధారణ వ్యక్తులే కాకుండా దివ్యాంగులు కూడా ఉపయోగించే విధంగా ఏర్పాట్లు చేశామన్నారు. ఫీడ్‌బ్యాక్‌ పరికరాల ద్వారా ప్రజల అభిప్రాయాలను తెలుసుకునే ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. 

నిబంధనలు పాటించకపోతే చర్యలు 

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగంగా కాకినాడ నగరపాలక సంస్థ అమలు చేస్తున్న నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని స్వచ్ఛ సర్వేక్షణ్‌ రెండో సర్కిల్‌ స్పెషల్‌ ఆఫీసర్‌ ఆకుమర్తి శామ్యూల్‌ హెచ్చరించారు. శ్రీనగర్‌లో మంగళవారం ఉదయం శానిటరీ సూపర్‌వైజర్‌ ఎస్‌కే జిలానీతో కలిసి పారిశుధ్య పనులను ఆయన పరిశీలించారు. టీ స్టాల్స్‌, వీధి హోటల్స్‌ వద్ద టీ కప్పులు, చెత్త ఉండటంతో దుకాణదారులకు అపరాధ రుసుం విధించారు. ఎటువంటి అనుమతులు లేని బడ్డీలను అక్కడి నుంచి తొలగించారు. ఆయన వెంట సచివాలయ శానిటరీ సెక్రటరీలు, మేస్త్రీలు ఉన్నారు. 

Updated Date - 2020-11-25T06:36:09+05:30 IST