దిగ్గజ సింగర్ ఇంట విషాదం.. కనిపించకుండా పోయిన తమ్ముడు..

ABN , First Publish Date - 2020-02-08T20:28:36+05:30 IST

ప్రముఖ సంగీత విద్వాంసుడు కేజే ఏసుదాస్ ఇంట విషాదం నిండింది. ఆయన సోదరుడు కేజే జస్టిన్ దుర్మరణం పాలయ్యారు.

దిగ్గజ సింగర్ ఇంట విషాదం.. కనిపించకుండా పోయిన తమ్ముడు..

ప్రముఖ సంగీత విద్వాంసుడు కేజే ఏసుదాస్ ఇంట విషాదం నిండింది. ఆయన సోదరుడు కేజే జస్టిన్ దుర్మరణం పాలయ్యారు. కేరళలోని కోచికి దగ్గరలోని థ్రిక్కాకారలో జస్టిన్ కుటుంబం నివసిస్తోంది. మంగళవారం నుంచి జస్టిన్ కనిపించడంలేదని ఆయన కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న అధికారులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలోనే కోచికి దగ్గరలోని ఓ చెరువులో జస్టిన్ మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. అయితే అతన్ని ఎవరైనా హత్య చేశారా? లేక ఆయనే ఆత్మహత్య చేసుకున్నారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Updated Date - 2020-02-08T20:28:36+05:30 IST