Advertisement
Advertisement
Abn logo
Advertisement

భారీ స్కోరు చేయకుండా ఆఫ్ఘనిస్థాన్‌ను కట్టడి చేసిన కివీస్

అబుదాబి: న్యూజిలాండ్‌తో జరుగుతున్న కీలక మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 124 పరుగులు మాత్రమే చేసి కివీస్ ఎదుట స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది.  టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న నబీ సేనకు ఏ దశలోనూ కలిసిరాలేదు. కివీస్ బౌలర్ల దెబ్బకు ఆఫ్ఘాన్ వికెట్లు టపటపా రాలిపోయాయి.


అయితే, నజీబుల్లా జద్రాన్ మాత్రం బౌలర్లను ఎదురొడ్డి ఒంటరి పోరాటం చేశాడు. బంతులను స్టాండ్స్‌లోకి తరలిస్తూ స్కోరు పెంచే ప్రయత్నం చేశాడు. మొత్తంగా 48 బంతులు ఎదుర్కొన్న జద్రాన్ 6 ఫోర్లు, మూడు సిక్సర్లతో 73 పరుగులు చేశాడు. గులాబ్దిన్ నైబ్ 15, కెప్టెన్ మహమ్మద్ నబీ 14 పరుగులు చేశారు. కివీస్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ 3, టిమ్ సౌథీ 2, మిల్నే, నీషమ్, సోధి చెరో వికెట్ తీసుకున్నారు.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement