Advertisement
Advertisement
Abn logo
Advertisement

న్యూజిలాండ్‌కు షాకిచ్చిన అక్సర్ పటేల్

కోల్‌కతా: భారత్ నిర్దేశించిన 185 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజిలాండ్‌కు అక్సర్ పటేల్ షాకిచ్చాడు. వేసిన తొలి ఓవర్‌లోనే రెండు వికెట్లు పడగొట్టాడు. 21 పరుగుల వద్ద ఓపెనర్ డరిల్ మిచెల్ (5).. అక్సర్ పటేల్ బౌలింగులో హర్షల్ పటేల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ స్కోరుకు మరొక్క పరుగు జోడించిన తర్వాత మార్క్ చాప్‌మన్ డకౌట్ అయ్యాడు. ప్రస్తుతం నాలుగు ఓవర్లు ముగిశాయి. కివీస్ రెండు వికెట్ల నష్టానికి 29 పరుగులు చేసింది. మార్టిన్ గప్టిల్ 24, ఫిలిప్స్ క్రీజులో ఉన్నారు.

Advertisement
Advertisement