Advertisement
Advertisement
Abn logo
Advertisement

ప్రారంభమైన న్యూజిలాండ్ పతనం.. కివీస్‌ను వణికిస్తున్న అశ్విన్

ముంబై: భారత్ నిర్దేశించిన 540 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజిలాండ్ క్రమంగా కష్టాల్లో కూరుకుపోతోంది. 13 పరుగుల వద్ద కెప్టెన్ టామ్ లాథమ్ (6) వికెట్‌ను కోల్పోయిన కివీస్..45 పరుగుల వద్ద మరో ఓపెనర్ విల్ యంగ్ (20) వికెట్‌ను చేజార్చుకుంది. ఆ స్కోరుకు పది పరుగులు జోడించాక రాస్ టేలర్ (6) పెవిలియన్ చేరాడు.


ఈ మూడు వికెట్లు అశ్విన్ ఖాతాలోనే చేరాయి. ప్రస్తుతం న్యూజిలాండ్ మూడు వికెట్ల నష్టానికి 63 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో కివీస్ విజయం సాధించాలంటే ఇంకా 477 పరుగులు చేయాల్సి ఉండగా, కోహ్లీ సేనకు ఏడు వికెట్లు చాలు. దీంతో  మ్యాచ్‌లో ఫలితం రేపు తేలిపోవడం పక్కాగా కనిపిస్తుంది. కాగా, అంతకుముందు భారత్ తన రెండో ఇన్నింగ్స్‌ను  276 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది.  

Advertisement
Advertisement