వైరస్‌లతో పోరాడే కివీ

ABN , First Publish Date - 2020-08-03T07:44:22+05:30 IST

కివీ పండును రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఇది ఇమ్యూనిటీ బూస్టర్‌గా పనిచేస్తుంది. ఆస్ర్పిన్‌ ఔషధంలో ఉండే గుణాలన్నీ కివీలో ఉంటాయని తాజా

వైరస్‌లతో పోరాడే కివీ

కివీ పండును రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఇది ఇమ్యూనిటీ బూస్టర్‌గా పనిచేస్తుంది. ఆస్ర్పిన్‌ ఔషధంలో ఉండే గుణాలన్నీ కివీలో ఉంటాయని తాజా అధ్యయనంలో తేలింది. పోషకాలతో నిండిన ఈ పండు తినడం వల్ల కలిగే ఆరోగ్య లాభాలివి...


పోషకాలెన్నో... 

కివీలో విటమిన్‌-సి సమృద్ధిగా లభిస్తుంది. ‘ఎ, ఇ’ విటమిన్లూ లభిస్తాయి. పొటాషియం, క్యాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్‌ వంటి మినరల్స్‌తో పాటు డైటరీ ఫైబర్‌ కూడా ఇందులో ఉన్నాయి.


జీర్ణక్రియ: కివీలో ఉండే డైటరీ ఫైబర్‌, ఆక్టినిడైన్‌ ఎంజైమ్‌లు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. బొప్పాయిలోని పపైన్‌, పైనాపిల్‌లోని బ్రోమేలైన్‌లా కివీలోని ఆక్టినిడైన్‌ పనిచేస్తుంది. ఇది పెరుగు, ఛీజ్‌, చేపలు, పచ్చి గుడ్లలో ఉండే కొన్ని పోషకాలు అరగడానికి సహకరిస్తుంది. ఫలితంగా మలబద్దకం సమస్యను తగ్గిస్తుంది.


రోగనిరోధకశక్తి: కివీలో సి-విటమిన్‌ అధికంగా లభిస్తుంది. హానికర వ్యాధులు, వైర్‌సలతో పోరాడే యాంటీ ఆక్సిడెంట్‌లు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. ఈ సీజన్‌లో తరచూ ఇబ్బంది పెట్టే జలుబు, ఫ్లూను తగ్గిస్తుంది. మొత్తంగా రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. మధుమేహం ఉన్నవారు కూడా కివీని తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. 


కళ్ల ఆరోగ్యం: ఈ పండులోని విటమిన్‌-ఎ, ల్యూటిన్‌, జీగ్జాంథిన్‌ కంటి చూపును మెరుగుపరుస్తాయి. అతినీలలోహిత కిరణాల నుంచి కళ్లను సంరక్షిస్తాయి.


సుఖనిద్ర: కివీలోని సెరోటోనిన్‌ నిద్రలేమి సమస్యకు ఔషధంగా పనిచేస్తుంది. నిద్రపోయే ముందు కివీ పండు తింటే సుఖనిద్ర పడుతుంది. అలాగే నారింజ, నిమ్మలో కన్నా కివీలో రెండు రెట్లు అధికంగా ఉండే సి-విటమిన్‌ దగ్గు, ముక్కు కారడం, శ్వాస ఇబ్బందుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

Updated Date - 2020-08-03T07:44:22+05:30 IST