కివీ.. ఆరోగ్యప్రదాయని

ABN , First Publish Date - 2020-03-14T06:01:24+05:30 IST

చూడ్డానికే కాదు రుచిలోనూ వెరైటీగా ఉండే కివీ ఫ్రూట్‌లో ఔషధ గుణాలు బోలెడు. నల్లగింజలు, ఆకుపచ్చ గుజ్జుతో కొంచెం వగరుగా, తీయగా ఉండే ఈ పండు అలసటను పోగొడుతుంది.

కివీ.. ఆరోగ్యప్రదాయని

చూడ్డానికే కాదు రుచిలోనూ వెరైటీగా ఉండే కివీ ఫ్రూట్‌లో ఔషధ గుణాలు బోలెడు. నల్లగింజలు, ఆకుపచ్చ గుజ్జుతో కొంచెం వగరుగా, తీయగా ఉండే ఈ పండు అలసటను పోగొడుతుంది. అంతేకాదు కివీ ఫేస్‌ప్యాక్‌తో చర్మం కాంతులీనుతుంది. ఇతర లాభాలేమంటే...


ఆరెంజ్‌, నిమ్మలో కన్నా కివీలోనే విటమిన్‌ సి పుష్కలంగా లభిస్తుంది. రోగనిరోధక శక్తి, ఎముకల దృఢత్వం పెరగడం, గాయాలు తొందరగా నయం కావడంలో విటమిన్‌ సి తోడ్పడుతుంది. 

కివీ తింటే ఒత్తిడి తగ్గిపోతుంది. ఈ పండులోని ఐరన్‌ దంతాలు దృఢంగా, కంటి చూపు చురుగ్గా ఉండడంలో సాయపడుతుంది. 

ఇందులోని సి, ఇ విటమిన్లు చర్మాన్ని యవ్వనంగా ఉంచుతాయి. కివీ ముక్కలను ముఖం మీద కాసేపు ఉంచి నీళ్లతో శుభ్రం చేసుకుంటే తాజాగా కనిపిస్తారు. 

నిద్రపోవడానికి గంట ముందు రెండు కివీ పండ్లు తింటే నిద్ర చక్కగా పడుతుంది. 

దీనిలో సహజంగా ఉండే యాక్టినిడిన్‌ ఎంజైమ్‌ జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. 

గర్భిణులు కివీ తింటే సరిపడా ఫోలిక్‌ ఆమ్లం లభిస్తుంది. బిడ్డ ఆరోగ్యంగా ఎదిగేందుకు ఫోలిక్‌ ఆమ్లం ఎంతో అవసరం.

క్యాలరీలు, కొవ్వు తక్కువగా ఉండే ఈ పండును సలాడ్‌ లేదా ఇతర పండ్లతో స్మూతీగా ఆరగించవచ్చు.

Updated Date - 2020-03-14T06:01:24+05:30 IST