చెన్నైలో మాంజాతో గాలిపటం ఎగురవేస్తే అరెస్టు తప్పదు

ABN , First Publish Date - 2020-05-29T02:49:38+05:30 IST

నగరంలో మాంజాను ఉపయోగించి, గాలిపటాలను ఎగురవేసేవారిపై గూండా

చెన్నైలో మాంజాతో గాలిపటం ఎగురవేస్తే అరెస్టు తప్పదు

చెన్నై : నగరంలో మాంజాను ఉపయోగించి, గాలిపటాలను ఎగురవేసేవారిపై గూండా చట్టాన్ని ప్రయోగించాలని చెన్నై నగర పోలీసు కమిషనర్ ఏకే విశ్వనాథన్ అంతర్గత ఆదేశాలు జారీ చేశారు. అష్ట దిగ్బంధనం సమయంలో మాంజాను ఉపయోగించి, గాలిపటాలను ఎగురవేయడం పెరిగిందని, ఈ తాడు వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఇప్పటి వరకు హెచ్చరించి వదిలిపెట్టామని, అయినప్పటికీ మాంజాను ఉపయోగించడం మానడం లేదని పేర్కొన్నారు. ఇక దయ చూపవలసిన సమయం మించిపోయిందని పేర్కొన్నారు. 


అనేక హెచ్చరికలు చేసినప్పటికీ, ప్రజలు వినేలా కనిపించడం లేదని ఓ పోలీసు ఉన్నతాధికారి చెప్పారు. పోలీసులు గస్తీ తిరిగేటపుడు, వారిని చూసి, గాలిపటాలు ఎగురవేసేవారు, మాంజాను అకస్మాత్తుగా కత్తిరించి, పారిపోతున్నారని చెప్పారు. ఆ గాలిపటాన్ని ఎవరు ఎగురవేశారో అక్కడి ప్రజలు కూడా చెప్పడం లేదన్నారు. 


చైనీస్ మాంజాను జాతీయ హరిత ట్రైబ్యునల్ 2017 జూలైలో నిషేధించింది. ఈ మాంజాను నైలాన్, సింథటిక్ మెటీరియల్‌తో తయారు చేస్తారు. ఇది భూమిలో కలవదు. 


Updated Date - 2020-05-29T02:49:38+05:30 IST