బాలుడి పెదాలపై ముద్దు పెట్టడం, కావలించుకోవడం వికృత లైంగిక నేరాలు కావు : Bombay High Court

ABN , First Publish Date - 2022-05-15T19:56:31+05:30 IST

ముంబై : పద్నాలుగేళ్ల బాలుడి పెదవులపై ముద్దు పెట్టడం, బుజ్జగించడం అసహజ నేరాలు కావని బాంబే హైకోర్ట్ వ్యాఖ్యానించింది. ఈ నేరాలు భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 377 పరిధిలోకి రాబోవని తేల్చిచెప్పింది.

బాలుడి పెదాలపై ముద్దు పెట్టడం, కావలించుకోవడం వికృత లైంగిక నేరాలు కావు : Bombay High Court

ముంబై : పద్నాలుగేళ్ల బాలుడి పెదవులపై ముద్దు పెట్టడం, కావలించుకోవడం వికృత లైంగిక నేరాలు కావని బాంబే హైకోర్ట్ వ్యాఖ్యానించింది. ఈ నేరాలు భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 377 పరిధిలోకి రాబోవని తేల్చిచెప్పింది. మైనర్ బాలుడిపై లైంగిక వేధింపుల కేసులో  ఓ నిందితుడికి బెయిల్ మంజూరు సందర్భంలో జస్టి అనుజ ప్రభుదేశాయ్ ఈ  వ్యాఖ్యలు చేశారు. తన 14 ఏళ్ల కొడుకుపై ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడని ముంబై వాసి ఒకరు గతేడాది పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తమ కప్‌బోర్డ్‌లోని కొంత సొమ్ము పోయిందని గుర్తించామని, బాలుడిని ప్రశ్నించగా నిందిత వ్యక్తికి ఇచ్చానని బాలుడు చెప్పాడని పేర్కొన్నారు. కాగా మైనర్ బాలుడు ఆడుకునే ఆన్‌లైన్ గేమ్ ‘ఓలా పార్టీ’కి రీచార్జ్ చేయించుకునేందుకు నిందిత వ్యక్తి షాప్‌కి వెళ్లేవాడు. ఒకరోజు రీచార్జ్ కోసం వెళ్లినప్పుడు బాలుడి పెదాలపై నిందిత వ్యక్తి ముద్దుపెట్టాడు. బాలుడి ప్రైవేటు భాగాలను కూడా తాకాడని  ఫిర్యాదులో బాలుడి తండ్రి పేర్కొన్నారు. దీంతో పోస్కో చట్టం‌తోపాటు వికృత లైంగిక చర్యలకు పాల్పడితే వర్తించే ఐపీసీలోని సెక్షన్ 377ని కూడా పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. ఈ సెక్షన్ కింద గరిష్ఠంగా జీవితకాల జైలుశిక్ష పడే అవకాశం కూడా ఉంటుంది.


అయితే మెడికల్ పరీక్ష ఫలితాలను పరిశీలించిన తర్వాత వికృత లైంగిక దాడి ఆరోపణలను సమర్థించే ఆధారాలు లభించలేదని జస్టిస్ అనుజ ప్రభుదేశాయ్ తెలిపారు. అయితే పోస్కో చట్టం కింద పెట్టిన కేసుల కింద గరిష్ఠంగా 5 ఏళ్ల వరకు జైలుశిక్ష పడొచ్చని, నిందితుడు బెయిల్‌కు అర్హుడేనని ఆమె స్పష్టం చేశారు. ఈ కేసులో అసహజ లైంగిక దాడి ప్రధానాంశంగా పరిగణించబడదని ఆమె వివరించారు. ఎఫ్‌ఐఆర్‌లో బాలుడి పెదవులపై ముద్దుపెట్టడం, ప్రైవేటు భాగాలను తాకడం పేర్కొనడాన్ని ప్రస్తావిస్తూ.. ఈ అంశాలకు సెక్షన్ 377 వర్తించబోదని క్లారిటీ ఇచ్చారు. నిందితుడు ఇప్పటికే ఏడాదిగా కస్టడీలో ఉన్నాడు. ఈ కేసులో ట్రయల్ త్వరలోనే ఆరంభమయ్యే అవకాశాలు కూడా కనిపించడం లేదని బెయిల్ ఇవ్వడాన్ని జడ్జి సమర్థించారు. రూ.30 వేల వ్యక్తిగత బాండ్‌పై బెయిల్ ఇవ్వాలని ఆదేశించారు.

Updated Date - 2022-05-15T19:56:31+05:30 IST