ట్విట్టర్‌లో TRSపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సెటైర్లు

ABN , First Publish Date - 2022-05-02T18:05:39+05:30 IST

హైదరాబాద్: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి టీఆర్ఎస్‌పై ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేశారు.

ట్విట్టర్‌లో TRSపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సెటైర్లు

హైదరాబాద్ : తెలంగాణలో టీఆర్ఎస్-బీజేపీ మధ్య సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తునే వార్ జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వంపై టీఆర్ఎస్ మంత్రులు ట్వీట్ చేస్తే.. ఇందుకు కౌంటర్‌గా రాష్ట్ర, కేంద్ర మంత్రులు స్పందిస్తూ కౌంటర్ ఎటాక్ చేస్తున్నారు. తాజాగా.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి టీఆర్ఎస్‌పై ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేశారు. టీఆర్ఎస్ పాలనలో "ఇంటికో ఉద్యోగం లేదు., నిరుద్యోగ భృతి లేదు., ఉచిత ఎరువులు లేవు., ఋణమాఫీ లేదు., దళిత ముఖ్యమంత్రి లేరు., దళితులకు మూడెకరాల భూమి లేదు., పంటనష్ట పరిహారం లేదు, దళితబందు లేదు, బీసీబంధు అసలే లేదు, ధాన్యం కొనుగోలు కేంద్రాల ఊసు లేదు, డబుల్ బెడ్ రూమ్ జాడ లేదు, అప్పులకు కొదవ లేదు, కొత్త రేషన్ కార్డుల ఊసు లేదు, కొత్త పెన్షన్ కార్డుల జాడ లేదు., సామాజిక న్యాయం లేదు., సచివాలయం లేదు., సీఎం ప్రజలను కలిసేది లేదు., ఉద్యమ కారులకు గౌరవం లేదు., విమోచన దినోత్సవం జరిపేది లేదు’’ ఇలా చెప్పుకుంటూపోతే సీఎం కేసీఆర్ మోసపూరిత హామీలకు కొదవ లేదంటూ కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు.


కాగా.. ఇవాళ ఉదయం కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీపై ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శల వర్షం కురిపించారు. అయితే ఇందుకు స్పందించిన కేంద్ర మంత్రి పై విధంగా కౌంటరిచ్చారు. 


               అసలు కేటీఆర్ ఏమని ట్వీట్ చేశారు..!?

Updated Date - 2022-05-02T18:05:39+05:30 IST