Oct 13 2021 @ 13:00PM

విజయ్ సరసన కీర్తి సురేశ్..?

కోలీవుడ్ స్టార్ హీరో 'తలపతి' విజయ్ సరసన కీర్తి సురేశ్ మరోసారి జతకట్టబోతుందా..! అవుననే టాక్ ప్రస్తుతం ఫిలిం సర్కిల్స్‌లో వినిపిస్తోంది. విజయ్ తెలుగులో స్రైట్ మూవీ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించబోతుండగా, అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ జరుగుతున్న ఈ మూవీ త్వరలో సెట్స్ మీదకి రాబోతోంది. కాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా చిత్రబృందం కీర్తి సురేశ్‌ను ఎంపిక చేసుకునే ఆలోచనలో ఉందని సమాచారం. మరి ఇది ఎంతవరకు నిజమో మేకర్స్ స్పందిస్తే గానీ ఓ క్లారిటీ వస్తుంది. ఇక గతంలో కీర్తి.. తమిళంలో తెరకెక్కిన 'సర్కార్', 'భైరవ' సినిమాలలో విజయ్ సరసన నటిచింది. ఈ ప్రాజెక్ట్ గనక ఓకే అయితే వీరి కాంబినేషన్‌లో హ్యాట్రిక్ మూవీ అవుతుంది. కాగా ప్రస్తుతం కీర్తి తెలుగులో మహేశ్ బాబుతో 'సర్కారు వారి పాట', మెగాస్టార్ చెల్లెలిగా 'భోళా శంకర్', రజనీకాంత్ చెల్లెలిగా 'అణ్ణాత్త' సినిమాలలో నటిస్తోంది.