కేంద్ర క్రీడల మంత్రి కిరణ్ రిజుజుకు అదనపు బాధ్యతలు

ABN , First Publish Date - 2021-01-20T02:39:32+05:30 IST

కేంద్ర క్రీడల మంత్రి కిరణ్ రిజుజుకు ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. శ్రీపాద్ వై నాయక్ నిర్వహిస్తున్న

కేంద్ర క్రీడల మంత్రి కిరణ్ రిజుజుకు అదనపు బాధ్యతలు

న్యూఢిల్లీ: కేంద్ర క్రీడల మంత్రి కిరణ్ రిజుజుకు ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది.  శ్రీపాద్ వై నాయక్ నిర్వహిస్తున్న ఆయుష్ మంత్రిత్వ శాఖ బాధ్యతలను కిరణ్‌కు అప్పగించారు. కర్ణాటకలో ఇటీవల జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో శ్రీపాద్ నాయక్ భార్య విజయ, ఆయన పీఏ దీపక్ మృతి చెందగా, మంత్రి తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్న ఆయన కోలుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన నిర్వహిస్తున్న ఆయుష్ మంత్రిత్వ శాఖ బాధ్యతలను కిరణ్ రిజుజుకు అప్పగించారు. నాయక్ కోలుకునేంత వరకు ఆయనీ బాధ్యతలను నిర్వర్తిస్తారు.  


Updated Date - 2021-01-20T02:39:32+05:30 IST