Advertisement
Advertisement
Abn logo
Advertisement

చాక్లెట్ల కోసం దుకాణానికి వెళ్లిన మూడేళ్ల పాప.. ఏడుస్తూ ఇంటికి రావడంతో ఏమైందని ఆ తల్లి ఆడిగితే..

బీహార్‌లోని బుక్సర్ పట్టణంలో ఒక మూడేళ్ల పాప సాయంత్రం ఇంటి పక్కనే ఉన్న చిల్లర దుకాణంలో చాక్లెట్లు కోసం వెళ్లింది. ఆ షాపు ఓనర్(21) ఆ పాప తల్లిదండ్రుల గ్రామస్థుడే కావడంతో వారికి బాగా పరిచయముంది. రోజూలాగే ఏదో బిస్కెట్లు, చాక్లెట్ల కోసం ఇంటి నుంచి బయటికి వెళ్లిన పాప చాలాసేపటికి వరకు ఇంటికి తిరిగి రాలేదు. షాపు ఓనర్‌ని అడిగితే పాప వెళ్లిపోయి చాలాసేపైందని చెప్పాడు.


పాప తల్లిదండ్రలు చాలా కంగారు పడి.. ఇంటి చుట్టు పక్కలంతా వెతికారు. వారు అలా వెతుకుతుండగా.. రాత్రి పాప తానంట తానే ఇంటికి వచ్చింది. "ఎక్కడికి వెళ్లావు చిన్ని?" అని తల్లి అడగడంతో పాప ఏడవడం మొదలుపెట్టింది. "ఏమైంది బుజ్జి? అమ్మకు చెప్పు.." అని ఆ తల్లి అడగడంతో తనకు కడుపులో నొప్పిగా ఉందని చెప్పింది. అప్పుడు పాప తల్లి పరిశీలించగా.. ఆమెకు నిజం తెలిసి చెమటలు పట్టాయి.


పాపపై ఎవరో అత్యాచారం చేశారు. పాపను వాళ్ల నాన్న విషయం పూర్తిగా చెప్పమని అడిగాడు. అప్పుడు పాప చాక్లెట్ కోసమని షాపుకు వెళ్తే ఆ అంకుల్ ఇంట్లోకి తీసుకెళ్లాడని చెప్పింది. ఈ విషయం విన్న ఆ తల్లిదండ్రులకు ఆ షాపు ఓనర్‌ని చంపేయాలనేంత కోపం వచ్చింది. కానీ విషయం బయటకు తెలిస్తే పరువు పోతుందని రాత్రంతా ఆలోచించారు. 


పాపను హింసించిన ఆ దుర్మాగుడిని వదలకూడదని నిర్ణయించుకొని.. చివరికి మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ షాపు ఓనర్‌ని అరెస్టు చేసి.. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement