మద్యం షాపు యజమానికి కిరాక్ ఐడియా

ABN , First Publish Date - 2020-06-17T22:14:58+05:30 IST

ఓ మద్యం షాపు యజమానికి కిరాక్ ఐడియా వచ్చింది.

మద్యం షాపు యజమానికి కిరాక్ ఐడియా

బిహార్: ఓ మద్యం షాపు యజమానికి కిరాక్ ఐడియా వచ్చింది. వచ్చిందో తడవుగా వెంటనే అమలు చేశాడు. కరోనా నేపథ్యంలో మానవ జీవన విధానంలో మునుపెన్నడూ లేని మార్పులు వచ్చాయి. ఇచ్చిపుచ్చుకోవడం, రోజువారి పనులను కూడా మార్చుకోవాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలోనే వినియోగదారులతో సామాజిక దూరం పాటించేందుకు బిహార్‌లో ఓ వైన్ షాపు యజమాని అమలు చేస్తున్న సరికొత్త టెక్నిక్ అందరినీ ఆకట్టుకుంది. 


షాపు ముందు యజమాని ఐదు అడుగుల పొడవుండే పెద్ద గొట్టాన్ని ఏర్పాటు చేశాడు. ఆ గొట్టంలో తాడు కట్టి ఉన్న ఓ సీసాను అమర్చాడు. ఆ పైపు వాలుగా ఉండడంతో సీసా దానంతట అదే జారి చివరికి వస్తుంది. అవసరమైనప్పుడు తాడు సాయంతో దాన్నిమళ్లీ వెనక్కి తీసుకోవచ్చు. ఇక మద్యం కొనుగోలు చేయాలనుకున్న వ్యక్తి ముందుగా సీసాలో డబ్బులు వేస్తే.. యజమాని తాడు సాయంతో గొట్టం ద్వారా సీసాను వెనక్కి లాగి అందులోని డబ్బులు తీసుకుని, కస్టమర్ కోరిన మద్యాన్ని ఆ గొట్టంలోకి జారవిడుస్తాడు. అది వినయోగదారుడు తీసుకుని వెళ్లిపోతాడు.

Updated Date - 2020-06-17T22:14:58+05:30 IST