Kinnerasaniకి భారీగా వరద నీరు

ABN , First Publish Date - 2022-07-10T18:07:23+05:30 IST

పాల్వంచ మండలం కిన్నెరసాని జలాశయానికి గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరద నీరు భారీగా చేరుతోంది. శనివారం సాయంత్రానికి

Kinnerasaniకి భారీగా వరద నీరు

                            - 403 అడుగులకు చేరిన నీటిమట్టం


పాల్వంచ(భద్రాద్రి కొత్తగూడెం), జూలై 9: పాల్వంచ మండలం కిన్నెరసాని జలాశయానికి గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరద నీరు భారీగా చేరుతోంది. శనివారం సాయంత్రానికి జలాశయ నీటిమట్టం 403 అడుగులకు చేరుకుంది. గరిష్ట నీటి మట్టం 407 అడుగులు కావడంతోపాటు ఇన్‌ఫ్లో 4వేల క్యూసెక్కులు ఉండటంతో అప్రమత్తమైన అధికారులు ముందస్థు చర్యల్లో భాగంగా రాత్రి 9 గంటలకు 3 గేట్లు ఎత్తి అధికంగా ఉన్న 15 వేల క్యూసెక్కుల  వరద నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేయనున్నారు. వరద నీటితో కళకళలాడుతున్న కిన్నెరసాని రిజర్వాయర్‌ అందాలను తిలకించడానికి సందర్శకులు భారీగా తరలివచ్చారు. కుటుంబ సమేతంగా నిండుకుండలా మారిన కిన్నెర అందా లను తిలకించారు. 


Updated Date - 2022-07-10T18:07:23+05:30 IST