కిన్నెరసాని రిజర్వాయర్‌కు భారీగా వరద నీరు..

ABN , First Publish Date - 2022-08-15T08:26:02+05:30 IST

కిన్నెరసాని రిజర్వాయర్‌కు వరదనీరు భారీగా వస్తోంది. ఆదివారం సాయంత్రానికి జలాశయం నీటి మట్టం 404. 80 అడుగులకు చేరుకుంది.

కిన్నెరసాని రిజర్వాయర్‌కు భారీగా వరద నీరు..
కిన్నెరసాని 4 గేట్లు ఎత్తిన దృశ్యం

పాల్వంచ, ఆగస్టు 14: కిన్నెరసాని రిజర్వాయర్‌కు వరదనీరు భారీగా వస్తోంది. ఆదివారం సాయంత్రానికి జలాశయం నీటి మట్టం 404. 80 అడుగులకు చేరుకుంది.  ఆళ్లపల్లి, మర్కోడు, గుండాల తదితర ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో వరదనీరు కిన్నెరసాని జలాశయానికి వస్తోంది. ఇన్‌ఫ్లో సైతం 14వేల క్యూసెక్కులుగా నమోదు కావడంతో అప్రమత్తమైన డ్యాం అధికారులు నాలుగు గేట్లు ఎత్తి 24వేల క్యూసెక్కుల వరదనీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

Updated Date - 2022-08-15T08:26:02+05:30 IST