ముండ్లాలో కింగ్‌కోబ్రా హల్‌చల్‌

ABN , First Publish Date - 2022-09-29T04:23:11+05:30 IST

కంచిలి మండలం ముండ్లా గ్రామంలో సుమారు 12 అడుగుల కింగ్‌ కోబ్రా హల్‌చల్‌ చేసింది. గ్రామానికి చెందిన దుర్యోదన చౌదరి ఇంట్లో బుధవారం సాయంత్రం కనిపించింది. బుసలు కొట్టడంతో ఇంట్లో ఉన్నవారంతా భయంతో బయటకు పరుగులు తీశారు.

ముండ్లాలో కింగ్‌కోబ్రా హల్‌చల్‌
పట్టుబడిన కోబ్రా

కంచిలి, సెప్టెంబరు 28: కంచిలి మండలం ముండ్లా గ్రామంలో సుమారు 12 అడుగుల కింగ్‌ కోబ్రా హల్‌చల్‌ చేసింది. గ్రామానికి చెందిన దుర్యోదన చౌదరి ఇంట్లో బుధవారం సాయంత్రం కనిపించింది. బుసలు కొట్టడంతో ఇంట్లో ఉన్నవారంతా భయంతో బయటకు పరుగులు తీశారు. స్థానికులు వెంటనే సోంపేటలో పాములు పట్టేవారికి సమాచారం అందించారు. వారు వచ్చి.. కింగ్‌కోబ్రాను చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ పామును అటవీశాఖ అధికారుల సమక్షంలో అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. ఇటీవల మండల పరిధిలోని బొగాబెణి, జలతంత్రకోట, కుంబరినౌగాం, ముండ్లా, పోలేరు తదితర అటవీ ప్రాంతాల్లో కింగ్‌కోబ్రాలు, విష సర్పాలు, బీరీ కొండ చిలువలు సంచరిస్తున్నాయి. దీంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. తమకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు.

 

Updated Date - 2022-09-29T04:23:11+05:30 IST