సెమీస్‌కు నడాల్‌, జొకోవిచ్‌ ఏటీపీ ఫైనల్స్‌

ABN , First Publish Date - 2020-11-21T10:30:05+05:30 IST

ముగింపు టెన్నిస్‌ టోర్నమెంట్‌ ఏటీపీ ఫైనల్స్‌లో సెర్బియా స్టార్‌ నొవాక్‌ జొకోవిచ్‌, స్పెయిన్‌ కింగ్‌ రఫెల్‌ నడాల్‌ సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లారు.

సెమీస్‌కు నడాల్‌, జొకోవిచ్‌  ఏటీపీ ఫైనల్స్‌

లండన్‌: సీజన్‌ ముగింపు టెన్నిస్‌ టోర్నమెంట్‌ ఏటీపీ ఫైనల్స్‌లో సెర్బియా స్టార్‌ నొవాక్‌ జొకోవిచ్‌, స్పెయిన్‌ కింగ్‌ రఫెల్‌ నడాల్‌ సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లారు. చావోరేవో తేల్చుకోవాల్సిన తమ గ్రూపు ఆఖరి మ్యాచుల్లో విజయాలు సాధించి తుది నలుగురి జాబితాలో వారు చోటు దక్కించుకున్నారు. శుక్రవారం జరిగిన టోక్యో 1970 గ్రూప్‌ చివరి మ్యాచ్‌లో వరల్డ్‌ నెంబర్‌వన్‌ జొకోవిచ్‌ 6-3, 7-6(7/4)తో అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ (జర్మనీ)ని ఓడించాడు. దీంతో తన గ్రూప్‌ నుంచి రెండోస్థానంలో నిలిచి సెమీస్‌ చేరాడు. ఇక.. లండన్‌ 2020 గ్రూప్‌ ఆఖరి మ్యాచ్‌లో నడాల్‌ 6-4, 4-6, 6-2తో డిఫెండింగ్‌ చాంపియన్‌ సిట్సిపా్‌సపై గెలిచాడు. ఈ గ్రూప్‌ నుంచి థీమ్‌ ఇదివరకే సెమీస్‌ చేరగా.. జొకో గ్రూప్‌ నుంచి మెద్వెదేవ్‌ సెమీ్‌సలో అడుగుపెట్టాడు. ఫైనల్‌ బెర్త్‌ కోసం థీమ్‌తో జొకోవిచ్‌, మెద్వెదేవ్‌తో నడాల్‌ అమీతుమీ తేల్చుకోనున్నారు.  

Updated Date - 2020-11-21T10:30:05+05:30 IST