‘22’ టీజ‌ర్ విడుద‌ల చేసిన కింగ్ నాగార్జున‌

డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌, సెన్సేషనల్‌ డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌, సూపర్‌ సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్‌ మారుతి వద్ద దర్శకత్వ శాఖలో అనుభవం సంపాదించుకున్న శివకుమార్‌ బి. కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వంలో మా ఆయి ప్రొడక్షన్స్‌ పతాకంపై రూపేష్‌కుమార్‌ చౌదరి, సలోని మిశ్రా హీరోహీరోయిన్లుగా రూపొందుతున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ '22'. షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సినిమా టీజ‌ర్‌ను కింగ్ నాగార్జున విడుద‌ల చేశారు.

 

ఇన్వెస్టిగేష‌న్ యాక్ష‌న్ క్రైమ్ థ్రిల్ల‌ర్‌గా రూపొందిన ఈ టీజ‌ర్‌లో కొంత మంది యువ‌తీ యువ‌కులు అనుమానాస్ప‌దంగా చ‌నిపోతుంటారు. ఆ హ‌త్య‌ల వెనుక ఉన్న కార‌ణ‌మేంటి? అనే విష‌యాన్ని పోలీస్ ఆఫీస‌ర్ ఎలా ఇన్వెస్టిగేట్ చేసి, సాల్వ్ చేశాడ‌నేది తెలియాలంటే ‘22’ సినిమా చూడాల్సిందే. సాయికార్తీక్ సంగీతం అందించిన ఈ సినిమాకు బి.వి.ర‌వికిర‌ణ్ సినిమాటోగ్ర‌ఫీ అందించారు.

Advertisement