North Korea: ఇక చెల్లి చెప్పినట్టు చెయ్యాల్సిందే..

ABN , First Publish Date - 2021-09-30T23:17:38+05:30 IST

స్టేట్ ఎఫైర్స్ కమిటీకి కొత్తగా ఏడుగురిని ప్రమోట్ చేశారు. అందులో యో జోంగ్ ఒకరు. అంతే కాదు, ఈ కమిటీలో ఏకైక మహిళ కూడా ఆమెనే. పదవి చాలా చిన్నదే అయినప్పటికీ చాలా కాలంగా కిమ్ జోంగ్ తర్వాత ప్యాంగాంగ్‌లో అత్యంత శక్తివంతమైన వ్యక్తి యో జోంగ్ అనే విషయం తెలిసిందే..

North Korea: ఇక చెల్లి చెప్పినట్టు చెయ్యాల్సిందే..

ప్యాంగాంగ్: ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్‌కి దేశంలో కీలక పదవి లభిచింది. దేవంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన స్టేట్ ఎఫైర్స్ కమిటీలోకి యో జోంగ్‌ని తీసుకున్నారు. కిమ్ జోంగ్ అధ్యక్షతన ఉన్న ఈ కమిటీనే ప్రభుత్వంలో అత్యంత కీలకమైంది. ఇప్పటికే కిమ్ జోంగ్‌కు అత్యంత సలహాదారుగా, నమ్మకస్తురాలిగా ఉన్న యో జోంగ్‌కి ఈ పదవితో అధికారం కూడా తోడైంది. స్టేట్ ఎఫైర్స్ కమిటీలో ఎంత మంది ఉన్నా నిర్ణయాధికారం యో జోంగ్‌కే ఉంటుందనే విషయం బహిర్గతమే, దీంతో ఇక చెల్లెలి సలహాలతో పాటు ఆమె సూచనలను కూడా కిమ్ పాటించాలంటూ కొందరు అంటున్నారు.


స్టేట్ ఎఫైర్స్ కమిటీకి కొత్తగా ఏడుగురిని ప్రమోట్ చేశారు. అందులో యో జోంగ్ ఒకరు. అంతే కాదు, ఈ కమిటీలో ఏకైక మహిళ కూడా ఆమెనే. పదవి చాలా చిన్నదే అయినప్పటికీ చాలా కాలంగా కిమ్ జోంగ్ తర్వాత ప్యాంగాంగ్‌లో అత్యంత శక్తివంతమైన వ్యక్తి యో జోంగ్ అనే విషయం తెలిసిందే. తాజాగా ఆమెను శక్తివంతమైన నాయకత్వం వైపు కిమ్ నడిపిస్తున్నట్లు కూడా ఊహాగాణాలు వస్తున్నాయి. 2018లో ఉత్తర కొరియాలో జరిగిన వింటర్ ఒలింపిక్స్‌కు యో జోంగ్‌నే బాధ్యత తీసుకున్నారు. వింటర్ ఒలింపిక్స్ నిర్వహణ పట్ల కిమ్ నుంచి ఆమెకు ప్రశంసలు కూడా వచ్చాయి. చెల్లెలి సమర్థత, పట్టుదల చూసి తాజాగా ఆమెను అత్యంత శక్తివంతమైన కమిటీలోకి కిమ్ తీసుకున్నట్లు సమాచారం.

Updated Date - 2021-09-30T23:17:38+05:30 IST