Chitrajyothy Logo
Advertisement
Published: Sat, 06 Aug 2022 17:36:34 IST

Kim Kardashian:కిమ్ కర్దాషియన్, పీట్ డేవిడ్‌సన్ బ్రేకప్ చెప్పుకున్నారా..!

twitter-iconwatsapp-iconfb-icon

రియాలిటీ షోలు, సినిమాలతో ప్రపంచ వ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్న సెలబ్రిటీ కిమ్ కర్దాషియన్ (Kim Kardashian). కామెడీ షోలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న స్టాండప్ కమెడియన్ పీట్ డేవిడ్‌సన్ (Pete Davidson). ఈ జంట తొమ్మిది నెలలుగా డేటింగ్ చేస్తున్నారు. తాజాగా వీరిద్దరూ విడిపోయారని హాలీవుడ్ మీడియాలో పలు కథనాలు వెలువడుతున్నాయి. 


కిమ్ కర్దాషియన్‌కు పీట్ డేవిడ్ సన్‌తో 2021 అక్టోబర్‌లో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఈ ఏడాది మెట్ గాలా ఈవెంట్‌లో ఈ జంట రెడ్ కార్పెట్‌పై నడిచి తాము డేటింగ్ చేస్తున్నామంటూ బహిరంగంగా ప్రకటించారు. తాజాగా ఏమైందో తెలియదు కానీ బ్రేకప్ చెప్పుకుని ఎవరి దారిని వారు చూసుకున్నారని పుకార్లు షికార్లు కొడుతున్నాయి. ‘‘పీట్, కిమ్ మధ్య బంధం సరిగ్గా లేదు. అందుకే బ్రేకప్ చెప్పుకున్నారు. ఒకరికి మరొకరిపై గౌరవం ఉంది. విడిపోయినప్పటికీ స్నేహితులుగా కొనసాగాలని వారు నిర్ణయించుకున్నారు’’ అని ఈ జంటతో సన్నిహితంగా మెలిగే వ్యక్తి చెప్పారు. పీట్ డేవిడ్ సన్ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ‘విజార్డ్స్’ (Wizards) షూటింగ్‌లో పాల్గొంటున్నాడు.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement