కిలో బంగారం దోపిడీ

ABN , First Publish Date - 2022-06-29T05:12:26+05:30 IST

కళ్లలో కారం చల్లి దుండగులు కిలో బంగారం, రూ.లక్ష నగదు ఎత్తుకెళ్లారు. ఈఘటన గార మండలం అంపోలు సమీపంలోని చెరువు వద్ద మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. బాధితుల వివరాల మేరకు.. నరసన్నపేటకు చెందిన బరాటం వాసుదేవరావు, ఇప్పిలి సంతోష్‌ అనే వ్యక్తులు సింగుపురం, శ్రీకూర్మం గ్రామాల్లో వర్తకులకు బంగారం ఇచ్చి తిరిగి పయనమయ్యారు.

కిలో బంగారం దోపిడీ
సంఘటనాస్థలాన్ని పరిశీలిస్తున్న అడిషనల్‌ ఎస్పీ తదితరులు



రూ.లక్ష నగదు కూడా.. కళ్లలో కారం చల్లి..
గార మండలం అంపోలు సమీపాన ఘటన
పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు

అంపోలు(గార), జూన్‌ 28: కళ్లలో కారం చల్లి దుండగులు కిలో బంగారం, రూ.లక్ష నగదు ఎత్తుకెళ్లారు. ఈఘటన గార మండలం అంపోలు సమీపంలోని చెరువు వద్ద మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. బాధితుల వివరాల మేరకు.. నరసన్నపేటకు చెందిన బరాటం వాసుదేవరావు, ఇప్పిలి సంతోష్‌ అనే వ్యక్తులు సింగుపురం, శ్రీకూర్మం గ్రామాల్లో వర్తకులకు బంగారం ఇచ్చి తిరిగి పయనమయ్యారు. అంపోలు మీదుగా నరసన్నపేట వెళ్తుండగా మార్గమధ్యంలో ఎదురుగా ద్విచక్రవాహనంపై ముగ్గురు వ్యక్తులు వచ్చారు. బైక్‌ ఆపి ఇద్దరి కళ్లలో కారం చల్లారు. అనంతరం వారి చేతిలో ఉన్న బ్యాగును ఎత్తుకుని పోయారు. ఇందులో కిలో బంగారం, రూ.లక్ష నగదు ఉన్నట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీకాకుళం డీఎస్పీ మహేంద్ర, సీఐ అంబేడ్కర్‌, క్లూస్‌ టీం సభ్యులు ఘటనా స్ధలానికి వెళ్లి పరిశీలించారు. ఘటన జరిగిన తీరును బాధితులను అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, నిందితులను త్వరలో పట్టుకుంటామని అడిషనల్‌ ఎస్పీ విఠలేశ్వరరావు తెలిపారు. ఎస్పీ రాధిక మంగళవారం రాత్రి గార పోలీస్‌స్టేషన్‌ను సందర్శించారు. ఘటనపై ఆరా తీశారు.


Updated Date - 2022-06-29T05:12:26+05:30 IST