Advertisement
Advertisement
Abn logo
Advertisement

భార్యను చంపి.. తానూ ఆత్మహత్య..

జగిత్యాల : భార్యను హత్య చేసిన భర్త... తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. కొడిమ్యాల మండలం నాచుపల్లి గ్రామంలో ఈ ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. బత్తిని దేవయ్య, ప్రమీల దంపతులు నాచుపల్లిలో నివాసం ఉంటున్నారు. ఇటీవల వారి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. రానురానూ ఇంకా ఎక్కువయ్యాయి. దీంతో ఆగ్రహం చెందిన దేవయ్య.. తన భార్యను హత్య చేశాడు. అనంతరం తానూ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మల్యాల సీఐ, కొడిమ్యాల ఎస్సైలు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement