Advertisement
Advertisement
Abn logo
Advertisement

నవరత్నాల కోసం పంచాయతీలను చంపేస్తారా..

నిధుల మళ్లింపుపై ఎంపీడీవో కార్యాలయం ఎదుట సర్పంచ్‌ల నిరసన

తోట్లవల్లూరు, డిసెంబరు 4 : నవరత్నాల కోసం గ్రామ పంచాయితీలను ఆర్ధికంగా చంపేసే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఎవ్వరిచ్చారని, రాజ్యాంగ విరుద్దమైన ఈ చర్య సర్పంచ్‌లను ఎన్నుకున్న ప్రజలను మోసగించటమేనని రాష్ట్ర ఉపాధిహామి మండలి మాజీ డైరెక్టర్‌ వీరంకి వెంకట గురుమూర్తి అన్నారు. 15వ ఆర్ధిక సంఘం నిధులను పంచాయతీలకు సమాచారం లేకుండా ప్రభుత్వం తీసుకున్నందుకు శనివారం తోట్లవల్లూరు మండల పరిషత్‌ కార్యాలయంలో బొడ్డపాడు సర్పంచ్‌ మూడే శివశంకర్‌, వల్లూరుపాలెం సర్పంచ్‌ కొనకాల రాజ్యలక్ష్మి, గరికపర్రు సర్పంచ్‌ వీరంకి రమాదేవి, పలు గ్రామాల వార్డు సభ్యులతో నిసరన చేపట్టారు. గురుమూర్తి మాట్లాడుతు వైసీపీకి చెందిన సర్పంచ్‌లు కూడా ప్రభుత్వ చర్యను నిరసించి వెనక్కు తీసుకున్న నిధులను పంచాయతీలకు జమచేసే విధంగా కృషి చేయాలన్నారు. మూడు గ్రామాల సర్పంచ్‌లు మాట్లాడుతూ ప్రస్తుతం తమ పంచాయతీల్లో ప్రజలకు మౌలిక వసతులు కల్పించేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం సూపరింటెండెంట్‌ ఉషారాణికి వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు వీరపనేని శివరామ్‌ప్రసాద్‌, గరికపర్రు ఎంపీటీసీ సభ్యుడు నర్రా వెంకట అప్పారావు, మాజీ సర్పంచ్‌లు పాముల శ్రీనివాసరావు, బొడ్డు సుగుణాకరరావు, పిట్టు వెంకటేశ్వరరావు, భీరం విజయ రామ్మోహన్‌రావు, నాయకులు చెన్నుపాటి శ్రీధర్‌, వల్లూరు కిరణ్‌, ఈడే వాసు, వల్లూరు రమేష్‌ పాల్గొన్నారు.


Advertisement
Advertisement