భారత్‌తో రెండో టీ20.. విండీస్ కెప్టెన్ పొలార్డ్ అరుదైన రికార్డ్

ABN , First Publish Date - 2022-02-19T01:15:11+05:30 IST

భారత్‌తో ఇక్కడి ఈడెన్ గార్డెన్స్‌ మైదానంలో జరుగుతున్న రెండో టీ20తో విండీస్ కెప్టెన్ కీరన్ పొలార్డ్

భారత్‌తో రెండో టీ20.. విండీస్ కెప్టెన్ పొలార్డ్ అరుదైన రికార్డ్

కోల్‌కతా: భారత్‌తో ఇక్కడి ఈడెన్ గార్డెన్స్‌ మైదానంలో జరుగుతున్న రెండో టీ20తో విండీస్ కెప్టెన్ కీరన్ పొలార్డ్ అరుదైన రికార్డు సాధించాడు. పొలార్డ్‌కు ఇది వందో టీ20. ఫలితంగా 100 టీ20లు ఆడిన తొలి విండీస్ ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఓవరాల్‌గా ఆ ఘనత సాధించిన 9వ ఆటగాడు. ఈ జాబితాలో పాకిస్థాన్ ఆల్‌రౌండర్ షోయబ్ మాలిక్ 124 టీ20లతో అందరికంటే ముందున్నాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అతడి కంటే మూడు మ్యాచ్‌లు వెనకబడి ఉన్నాడు. 


పొట్టి ఫార్మాట్‌లో పలు రికార్డులు సృష్టించిన క్రిస్ గేల్ 79 టీ20లు ఆడగా, డారెన్ బ్రావో 91 టీ20లతో పొలార్డ్ వెనక ఉన్నాడు. అంతర్జాతీయ టీ20 మ్యాచుల్లో పొలార్డ్ 1561 పరుగులు చేశాడు. 42 వికెట్లను తన ఖాతాలో వేసుకుని చక్కని ఆల్‌రౌండర్‌గా పేరు తెచ్చుకున్నాడు.


భారత్‌తో రెండో వన్డేలో బరిలోకి దిగడానికి ముందు పొలార్డ్‌ను జట్టు సభ్యులు గౌరవించారు. జాసన్ హోల్డర్ కెప్టెన్‌కు 100వ టీ20 టోపీ ఇవ్వగా, నికోలస్ పూరన్ జెర్సీ అందజేశాడు. విండీస్ స్కిప్పర్‌కు బీసీసీఐ ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపింది. 



Updated Date - 2022-02-19T01:15:11+05:30 IST