సీబీఎ్‌సఈ ‘బడి’ బాట

ABN , First Publish Date - 2020-09-25T09:49:36+05:30 IST

హైదరాబాద్‌లోని పలు సీబీఎ్‌సఈ, కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో ప్రత్యక్ష బోధన తిరిగి ఊపందుకుంటోంది. కరోనా వైరస్‌ నేపథ్యంలో మార్చి 16 నుంచి మూతపడిన ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యాసంస్థలు ఈనెల 21 నుంచి తిరిగి తెరుచుకున్నాయి...

సీబీఎ్‌సఈ ‘బడి’ బాట

  • 9 నుంచి 12 తరగతులకు బోధన
  • 60 శాతం హాజరవుతున్న విద్యార్థులు

హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని పలు సీబీఎ్‌సఈ, కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో ప్రత్యక్ష బోధన తిరిగి ఊపందుకుంటోంది. కరోనా వైరస్‌ నేపథ్యంలో మార్చి 16 నుంచి మూతపడిన ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యాసంస్థలు ఈనెల 21 నుంచి తిరిగి తెరుచుకున్నాయి. గ్రేటర్‌లోని హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల పరిధిలో సీబీఎ్‌సఈ పాఠశాలలు 340 వరకు ఉన్నాయి. వీటిలో హైదరాబాద్‌ జిల్లాలో 65 స్కూళ్లు ఉన్నాయి. ఈ పాఠశాలల్లో 9 నుంచి 12వ తరగతి వరకు సుమారు 2.30 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు.  కరోనా వైరస్‌ నేపథ్యంలో మార్చి 16 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలను మూసివేశారు. అనంతరం జూన్‌ రెండో వారం నుంచి ఆన్‌లైన్‌ తరగతులను నిర్వహిస్తున్న సీబీఎ్‌సఈ, ఇతర కార్పొరేట్‌ పాఠశాలలు.. తాజాగా తరగతి గదిలో బోధనలను ప్రారంభించాయి. గత మూడు రోజులుగా గ్రేటర్‌లోని సీబీఎ్‌సఈ పాఠశాలల్లో 60 శాతం వరకు  9 నుంచి 12వ తరగతి విద్యార్థులు హాజరవుతున్నారు. తల్లిదండ్రుల నుంచి అంగీకార పత్రాన్ని తీసుకున్న తర్వాతే విద్యార్థులను తరగతి గదుల్లోకి అనుమతిస్తున్నారు. విద్యార్థులు కొవిడ్‌ నిబంధనలు పాటించేలా తల్లిదండ్రులకు ఆయా పాఠశాలల యాజమాన్యాలు వాట్సాప్‌ సందేశాలను పంపిస్తున్నాయి. కాగా ఇంటివద్ద ఆన్‌లైన్‌ పాఠాలను తమ పిల్లలు సరిగా వినడం లేదని, ప్రత్యక్ష బోధనలు అందించాలని చాలామంది తల్లిదండ్రులు తమకు ఫోన్లు చేస్తున్నారని పలు ప్రైవేట్‌ విద్యాసంస్థల యజమానులు చెబుతున్నారు. బడికి రావాలని ఎవరినీ బలవంతం చేయడం లేదని పాఠశాలల యాజమాన్యాలు పేర్కొంటున్నాయి.  కాగా, సర్కారు బడులకు మాత్రం 9, 10 తరగతుల విద్యార్థులు ఇప్పటివరకు ఎవరూ వెళ్లకపోవడం గమనార్హం. 


Updated Date - 2020-09-25T09:49:36+05:30 IST