కిడ్నీలు పూర్తి స్థాయిలో పాడైపోకుండా ఉండాలంటే ఏం చేయాలి?

ABN , First Publish Date - 2022-03-22T16:34:30+05:30 IST

మూత్రపిండాల్లో సమస్యలు భిన్నమైన లక్షణాల ద్వారా బయల్పడుతూ ఉంటాయి. వాటి మీద

కిడ్నీలు పూర్తి స్థాయిలో పాడైపోకుండా ఉండాలంటే ఏం చేయాలి?

ఆంధ్రజ్యోతి(22-03-2022)

మూత్రపిండాల్లో సమస్యలు భిన్నమైన లక్షణాల ద్వారా బయల్పడుతూ ఉంటాయి. వాటి మీద ఓ కన్నేసి ఉంచగలిగితే, మూత్రపిండాలు పూర్తి స్థాయిలో పాడైపోకుండా కాపాడుకోవచ్చు. 


మూత్రవిసర్జన కష్టమవుతుంది. మూత్రంలో తెల్లని నురగ కనిపిస్తుంది లేదా చిక్కని రంగులోకి మారుతుంది. మూత్రపిండాల పనితీరు మందగించినప్పుడు, శరీరంలోని అదనపు ద్రవాలు ఫిల్టర్‌ కావు. దాంతో ముఖం, కాళ్లు, కీళ్లు వాచిపోతాయి. రక్తంలో వ్యర్థాలు మిగిలిపోవడం మూలంగా, నోటి దుర్వాసన లేదా నోట్లో లోహపు రుచి లాంటి లక్షణాలు మొదలవుతాయి. ఆకలి కూడా మందగిస్తుంది. వెన్ను పై భాగంలో నొప్పి ఉంటుంది. మూత్రపిండాలు పాడవడం వల్ల ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు కూడా మొదలవుతాయి. ఏకాగ్రత లోపిస్తుంది. తల తిరుగుడు మొదలవుతుంది. చర్మం దురదలు, దద్దుర్లు మొదలవుతాయి. రక్తంలో వ్యర్థాలు పేరుకుపోవడం మూలంగా చర్మం మెరుపు తగ్గుతుంది, పొడి బారుతుంది. ఈ లక్షణాలన్నీ మూత్రపిండాలు పాడవుతున్నాయి అనడానికి సూచనలు. ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే అత్యధిక యాంటీఆక్సిడెంట్లు కలిగిన ఆహారం ఎంచుకోవాలి. అలాగే సరిపడా నీళ్లు తాగడంతో పాటు మూత్రపిండాలను దెబ్బతీసే అధిక రక్తపోటు, మధుమేహాలను అదుపులో ఉంచుకోవాలి. 

Updated Date - 2022-03-22T16:34:30+05:30 IST