కిడ్నీ ఫెయిలైతే?

ABN , First Publish Date - 2021-03-02T18:14:41+05:30 IST

కిడ్నీ ఫెయిల్యూర్‌ చాప కింద నీరులా నిశ్శబ్దంగా దాడి చేస్తుంది. ఆ స్థితికి ముందు బయల్పడే లక్షణాలను నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. అత్యంత సాధారణమైనవిగా కనిపించే కిడ్నీ ఫెయిల్యూర్‌ లక్షణాలు ఇవే!

కిడ్నీ ఫెయిలైతే?

ఆంధ్రజ్యోతి(02-03-2021)

కిడ్నీ ఫెయిల్యూర్‌ చాప కింద నీరులా నిశ్శబ్దంగా దాడి చేస్తుంది. ఆ స్థితికి ముందు బయల్పడే లక్షణాలను నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. అత్యంత సాధారణమైనవిగా కనిపించే కిడ్నీ ఫెయిల్యూర్‌ లక్షణాలు ఇవే!

కిడ్నీ పెయిన్‌: నడుము వెనక కిడ్నీలు ఉండే ప్రదేశంలో, ఛాతీ ఎముకల అడుగు, లేదా పొట్టలో నొప్పి వేధిస్తూ ఉంటుంది.

మూత్రం: సాధారణంగా కంటే తక్కువ మూత్రం తయారవుతూ ఉండడం, కొన్నిసార్లు మూత్రమే రాకపోవడం ప్రధాన లక్షణాలుగా కనిపిస్తాయి. కిడ్నీ వ్యాధి ఉన్నప్పుడు ఇందుకు విరుద్ధంగా ఎక్కువ మూత్రం విడుదలవుతూ, దాన్లో రక్తం కనిపించవచ్చు. లేదా మూత్రం రంగు మారవచ్చు.

నీటి నిల్వ: నీటిని వడకట్టలేని కిడ్నీల కారణంగా శరీరంలో నీరు నిల్వ ఉండిపోతూ ఉంటుంది. దాంతో ఎలక్ర్టొలైట్లలో హెచ్చుతగ్గుల మూలంగా నడుము కింద భాగం... కాళ్లు, చీలమండలం, పాదాలలో నీళ్లు చేరుకుంటూ ఉంటాయి.

వాపులు: కళ్ల దిగువన, ముఖంలో వాపు తలెత్తుతుంది.

ఇతర ఇబ్బందులు: అజీర్తి, వాంతులు, ఆకలి కోల్పోవడం

బిపి: అధిక రక్తపోటు నమోదవుతూ ఉంటుంది. 

Updated Date - 2021-03-02T18:14:41+05:30 IST