విజయవాడ: నగరంలో యువతి కిడ్నాప్ కలకలం సృష్టించింది. తాడిగడప దగ్గర యువతిని దుండగులు కిడ్నాప్ చేసారు. యువతి కేకలు వేయడంతో కంట్రోల్ రూమ్‌కి ఆటోడ్రైవర్ కాల్ చేసాడు. ఆటోడ్రైవర్ సమాచారంతో నగరంలో పలు చోట్ల పోలీసులు తనిఖీలు చేపట్టారు. సీసీ ఫుటేజిని పోలీసులు పరిశీలిస్తున్నారు. దర్యాప్తునకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు.