California: కాలిఫోర్నియాలో కిడ్నాప్ అయిన ఇండియన్ ఫ్యామిలీ కథ విషాదాంతం

ABN , First Publish Date - 2022-10-06T16:07:04+05:30 IST

అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో శనివారం అపహరణకు గురైన నలుగురు భారతీయ కుటుంబ సభ్యుల కథ విషాదాంతమైంది. నలుగురు విగతజీవులుగా కనిపించారు. ఈ మేరకు కాలిఫోర్నియా పోలీసులు తాజాగా ఓ ప్రకటన విడుదల చేశారు. "ఇది భయంకరమైన ఘటన. కిడ్నాప్ అయిన ప్రాంతంలోనే నలుగురు భారతీయుల మృతదేహాలను గుర్తించాం.

California: కాలిఫోర్నియాలో కిడ్నాప్ అయిన ఇండియన్ ఫ్యామిలీ కథ విషాదాంతం

కాలిఫోర్నియా: అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో శనివారం అపహరణకు గురైన నలుగురు భారతీయ కుటుంబ సభ్యుల కథ విషాదాంతమైంది. నలుగురు విగతజీవులుగా కనిపించారు. ఈ మేరకు కాలిఫోర్నియా పోలీసులు తాజాగా ఓ ప్రకటన విడుదల చేశారు. "ఇది భయంకరమైన ఘటన. కిడ్నాప్ అయిన ప్రాంతంలోనే నలుగురు భారతీయుల మృతదేహాలను గుర్తించాం. చాలా బాధాకరం." అని మెర్సిడ్ కౌంటీ పోలీస్ అధికారి వెర్న్ వార్న్‌కే (Vern Warnke) అన్నారు. పంజాబ్‌ రాష్ట్రం హోషియార్‌పూర్‌లోని హర్సీ పిండ్‌కు చెందిన ఈ కుటుంబం సోమవారం కాలిఫోర్నియాలోని మెర్సిడ్ కౌంటీలో కిడ్నాప్ అయింది. గుర్తు తెలియని వ్యక్తులు భారత సంతతికి చెందిన నలుగురిని అపహరించారు. కిడ్నాప్ అయిన వారిలో ఓ 8 నెలల పసికందు కూడా ఉంది. అపహరణకు గురైనవారిలో జస్దీప్​ సింగ్(36)​, జస్లీన్​ కౌర్ (27), చిన్నారి​ ఆరూహీ ధేరీ, అమన్​దీప్​ సింగ్ (39)​ ఉండగా.. వీరిని అగంతకులు హతమార్చారు.


కుటుంబ సభ్యులలో ఒకరికి చెందిన వాహనం సోమవారం మంటల్లో కాలిపోయి కనిపించింది. దాంతో ఆ నలుగురిని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అనంతరం మెర్సిడ్ కౌంటీలోని అట్‌వాటర్‌లోని ఓ ఏటీఎం (ATM) వద్ద బాధితుడి బ్యాంక్ కార్డ్‌లలో ఒకటి వినియోగించబడిందని డిటెక్టివ్‌లకు మంగళవారం ఉదయం సమాచారం అందింది. దాంతో మెర్సిడ్ కౌంటీ పోలీసులు, డిటెక్టివ్‌ల సహాయంతో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే అపహరణకు గురైన నలుగురు మృతిచెంది కనిపించారు. అయితే, కిడ్నాప్​ జరిగిన ప్రదేశం అనేక రెస్టారెంట్లు, షాపులతో ఎల్లప్పుడూ రద్దీగా ఉండే వ్యాపార సముదాయ ప్రాంతం. అయినప్పటికీ ఈ ఘటన జరగడం పలు అనుమానాలకు దారితీస్తోందని పోలీసులు తెలిపారు. నిందితుల గురించి తెలిసిన వారు ఎమర్జెన్సీ నెంబర్​కు కాల్​ చేసి సమాచారం అందించాలని మెర్సిడ్ కౌంటీ పోలీస్ అధికారి వెర్న్ వార్న్‌కే కోరారు. 

Updated Date - 2022-10-06T16:07:04+05:30 IST