మైనర్ బాలిక కిడ్నాప్...రెండు నెలల తర్వాత కాపాడిన పోలీసులు

ABN , First Publish Date - 2021-01-23T03:06:30+05:30 IST

14 ఏళ్ల వయసు గల మైనర్ బాలికను కిడ్నాప్ చేసి తీసుకువెళ్లిన యువకుడిని అరెస్టు చేసి బాలికను కాపాడి తల్లిదండ్రుల వద్దకు చేర్చిన ఘటన....

మైనర్ బాలిక కిడ్నాప్...రెండు నెలల తర్వాత కాపాడిన పోలీసులు

థానే (మహారాష్ట్ర) : 14 ఏళ్ల వయసు గల మైనర్ బాలికను కిడ్నాప్ చేసి తీసుకువెళ్లిన యువకుడిని అరెస్టు చేసి బాలికను కాపాడి తల్లిదండ్రుల వద్దకు చేర్చిన ఘటన మహారాష్ట్రలోని థానే జిల్లా ముంబ్రా నగరంలో వెలుగుచూసింది. సాగర్ షిండీఫల్ (25) అనే యువకుడు గత ఏడాది నవంబరులో 14 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేశాడు. బాలిక తన మామయ్య కూతురని, తామిద్దరం  పెళ్లి చేసుకున్నామని చెప్పి ఇద్దరూ అహ్మద్ నగర్ ప్రాంతంలోని కునాల్ రెస్టారెంటులో కార్మికులుగా చేరారు. నిందితుడు సాగర్ రెస్టారెంటులో వెయిటరుగా, బాలిక వంటమనిషిగా చేరింది. బాలిక కిడ్నాప్ జరిగిన రెండు నెలల తర్వాత సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి బాలికను కాపాడి ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు.

Updated Date - 2021-01-23T03:06:30+05:30 IST