యువకుల కిడ్నాప్‌ కథ సుఖాంతం

ABN , First Publish Date - 2020-12-02T06:31:46+05:30 IST

గోపాలపట్నం (విశాఖపట్నం) డిసెంబరు 1: యువకుల కిడ్నాప్‌ కథ సుఖాంతమైంది. విశాఖలోని గోపాలపట్నం పోలీ సులు ఈ కేసును 24 గంటల్లో ఛేదించి కిడ్నాప్‌ సూత్రధారైన యువకుడితోపాటు మరో ఐదుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అమలాపురానికి చెందిన అల్లాడి రాజా (27),

యువకుల కిడ్నాప్‌ కథ సుఖాంతం

కిడ్నాప్‌ సూత్రధారితో పాటు మరో ఐదుగురి అరెస్టు

అంతా ‘తూర్పు’ వాళ్లే

స్వస్థలాలకు చేరిన బాధితులు 

గోపాలపట్నం (విశాఖపట్నం) డిసెంబరు 1: యువకుల కిడ్నాప్‌ కథ సుఖాంతమైంది. విశాఖలోని గోపాలపట్నం పోలీ సులు ఈ కేసును 24 గంటల్లో ఛేదించి కిడ్నాప్‌ సూత్రధారైన యువకుడితోపాటు మరో ఐదుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అమలాపురానికి చెందిన అల్లాడి రాజా (27), కాకినాడకు చెందిన అడపా తరుణ్‌(23) కార్లను కొనుగోలు చేయడం, విక్రయించడం వంటి వ్యాపారం చేస్తుంటారు. ఈ క్రమంలో రాజా తన మిత్రుడైన తరుణ్‌కు రూ.6 లక్షలు బాకీ పడ్డాడు. ప్రస్తుతం ట్రావెల్స్‌ వాహనాలకు డ్రైవర్‌గా పనిచేస్తు న్న రాజా తన మిత్రులైన అమలాపురానికి చెందిన జగదీశ్‌, ఎస్‌.కోటకు చెందిన మట్టపర్తి కిరణ్‌తో కలిసి గత నెల 13వ తేదీ నుంచి విశాఖ బాజీ జంక్షన్‌లోని ఓ లాడ్జిలో ఉంటున్నాడు. రాజా సకాలంలో బాకీ చెల్లించకపోవడంతో గతనెల 26న వారు ఉంటున్న లాడ్జికి కొంతమంది వ్యక్తులతో తరుణ్‌ వచ్చాడు. ఆ సమయంలో రాజా లేకపోవడంతో అతని స్నేహితుడు కిరణ్‌ను కిడ్నాప్‌ చేశారు. 


మర్నాడు మళ్లీ వచ్చి రాజా, అతని స్నేహితు డు జగదీశ్‌ను కూడా కిడ్నాప్‌ చేసి సాగర్‌నగర్‌లోని ఓ గెస్ట్‌ హౌస్‌లో బంధించి తీవ్రంగా కొట్టారు. కాగా గత నెల 28వ తేదీ రాత్రి కిడ్నాపర్ల చెర నుంచి కిరణ్‌, జగదీశ్‌లు తప్పించుకుని గోపాలపట్నం చేరుకున్నారు. వారు గాయపడడంతో ఆస్పత్రిలో చికిత్స చేయించుకుని 29వ తేదీ రాత్రి గోపాలపట్నం పోలీసు లకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అప్రమత్తమై వారిని తీసు కుని సాగర్‌నగర్‌ గెస్ట్‌హౌస్‌ వద్దకు వెళ్లారు. అప్పటికే కిడ్నాపర్లు పరారయ్యారు. బాధితుల వివరాల ఆధారంగా కిడ్నాపర్లు సూరాడ భరత్‌(19), బొడ్డు అనిల్‌కుమార్‌ (35)ను సోమవారం అదుపులోకి తీసుకుని విచారించారు. అనంతరం కిడ్నాప్‌నకు సూత్రధారైన అడపా తరుణ్‌తోపాటు బొండాడ అదృష్ట దీపక్‌ (40), అహ్మదుల్లా ఖాన్‌(28), బొబ్బర రాజేశ్‌కుమార్‌(30)లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కిడ్నాపర్ల బృందంలోని శివ, బిట్టు, పెద్ద, డేనియల్‌లు పరారీలో ఉన్నారు. 

Updated Date - 2020-12-02T06:31:46+05:30 IST