Thailand Open : రెండో రౌండ్‌లోకి Kidambi Srikanth ప్రవేశం

ABN , First Publish Date - 2022-05-18T22:16:51+05:30 IST

చరిత్రాత్మక విజయంతో భారత్‌కు ‘థామస్ కప్’(Thomas cup) అందించిన జట్టులో కీలక సభ్యుడైన కిదాంబి శ్రీకాంత్ థాయ్‌లాండ్ ఓపెన్‌లోనూ

Thailand Open : రెండో రౌండ్‌లోకి Kidambi Srikanth ప్రవేశం

నొంతాబురి, థాయ్‌ల్యాండ్ : చరిత్రాత్మక విజయంతో భారత్‌కు ‘థామస్ కప్’(Thomas cup) అందించిన జట్టులో కీలక సభ్యుడైన కిదాంబి శ్రీకాంత్ థాయ్‌లాండ్ ఓపెన్‌లోనూ  తన దూకుడును కొనసాగిస్తున్నాడు. మొదటి రౌండ్ మ్యాచ్‌లో ఫ్రాన్స్ ఆటగాడు బ్రిస్ లివర్డెజ్‌పై 3 గేమ్స్‌లో గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధించి రెండవ రౌండ్‌లోకి ప్రవేశించాడు. బీడబ్ల్యూఎఫ్ సూపర్ 500 టోర్నమెంట్‌లో 8వ సీడెడ్ ఆటగాడిగా అడుగుపెట్టిన శ్రీకాంత్ మొదటి రౌండ్‌ మ్యాచ్‌ను 18-21  21-10   21-16 పాయింట్ల తేడాతో దక్కించుకున్నాడు. మొత్తం 49 నిమిషాల్లో ఈ మ్యాచ్ ముగిసింది. శ్రీకాంత్ తదుపరి మ్యాచ్‌లో ఐర్లాండ్‌కు చెందిన నట్ నుయెన్‌తో తలపడనున్నాడు. నట్ నుయెన్‌ మొదటి రౌండ్‌ మ్యాచ్‌లో డెన్మార్క్‌కు చెందిన క్రీడాకారుడు హన్స్-క్రిస్టియాన్‌ను 21-12   23-21 తేడాతో ఓడించాడు.


ఉమెన్స్ సింగిల్స్‌లో నిరాశ..

థాయ్‌లాండ్ ఓపెన్ ఉమెన్స్ సింగిల్స్ రౌండ్‌లో భారత ప్లేయర్లకు నిరాశే ఎదురైంది. ఇండియన్ క్వాలిఫయర్ అశ్మిత చలిహా థాయ్‌లాండ్‌కు చెందిన 7వ సీడ్ రచ్నోక్ ఇన్‌టానొన్ చేతిలో ఓటమిపాలైంది. 10-21   15-21 వ్యత్యాసంతో మ్యాచ్‌ను చేజార్చుకుంది. కేవలం 29 నిమిషాల్లోనే ఈ మ్యాచ్ ముగిసింది. ఇక భారత్‌కే చెందిన మరో క్వాలిఫయర్ ఆకర్షి కశ్యప్ మొదటి రౌండ్ మ్యాచ్‌లో కెనడాకు చెందిన మిచెల్లీ లీ చేతిలో 13-21  18-21 తేడాతో ఓడిపోయింది. ఇక మిక్స్‌డ్ డబుల్స్ జంట బీ సుమీత్ రెడ్డి, అశ్విని పొన్నప్ప కూడా తొలి రౌండ్‌లోనే నిష్ర్కమించారు. 8వ సీడెడ్ జపాన్ ద్వయం యుకి కనెకో, మిసాకీ మత్సుటొమో చేతిలో 17-21  17-21 తేడాతో ఓటమిని చవిచూశారు. ఈ మ్యాచ్ 34 నిమిషాల్లో ముగిసిపోయింది. ఇక భారత్‌కే చెందిన టాప్ షట్లర్లు, చరిత్రాత్మక థామస్ కప్ గెలుపొందిన టీం సభ్యులైన పీవీ సింధు, హెచ్‌ఎస్ ప్రణయ్ షెడ్యూల్ ప్రకారం బుధవారమే తమ మ్యాచ్‌లు ఆడనున్నారు.

Updated Date - 2022-05-18T22:16:51+05:30 IST