ముగిసిన శ్రీకాంత్‌ పోరాటం

ABN , First Publish Date - 2020-10-17T08:52:20+05:30 IST

టైటిల్‌ అంచనాలతో డెన్మార్‌ ఓపెన్‌ బరిలోకి దిగిన భారత స్టార్‌ షట్లర్‌ కిడాంబి శ్రీకాంత్‌ పోరాటం క్వార్టర్స్‌లోనే ముగిసింది...

ముగిసిన శ్రీకాంత్‌ పోరాటం

డెన్మార్క్‌ ఓపెన్‌ క్వార్టర్స్‌లో పరాజయం

ఒడెన్స్‌: టైటిల్‌ అంచనాలతో డెన్మార్‌ ఓపెన్‌ బరిలోకి దిగిన భారత స్టార్‌ షట్లర్‌ కిడాంబి శ్రీకాంత్‌ పోరాటం క్వార్టర్స్‌లోనే ముగిసింది. శుక్రవారం జరిగిన క్వార్టర్స్‌ పోరులో శ్రీకాంత్‌ 22-20, 13-21, 16-21తో చౌ టిన్‌ చెన్‌ (చైనీస్‌ తైపీ) చేతిలో ఓటమి పాలయ్యాడు. హోరాహోరీగా సాగిన తొలి గేమ్‌ను శ్రీకాంత్‌ చివరి వరకు పోరాడి గెలుచుకున్నాడు. రెండో సెట్‌ ప్రారంభంలోను శ్రీకాంత్‌ 9-9తో పోరాట పటిమ చూపించాడు. ఆ తర్వాత పుంజుకున్న వరల్డ్‌ నెంబర్‌ 2 చెన్‌ 21-13తో రెండో గేమ్‌ను కైవసం చేసుకొని 1-1తో సమంగా నిలిచాడు. నిర్ణయాత్మక మూడో సెట్‌లో ఆది నుంచే చెన్‌ ఆధిపత్యం ప్రదర్శిస్తూ 21-16తో గేమ్‌తో పాటు మ్యాచ్‌ను కూడా సొంతం చేసుకొని సెమీస్‌లో ప్రవేశించాడు. శ్రీకాంత్‌ ఓటమితో డెన్మార్క్‌ ఓపెన్‌లో భారత షట్లర్ల పోరు ముగిసింది.

Updated Date - 2020-10-17T08:52:20+05:30 IST