శ్రీకాంత్‌, సైనాకు సులువైన డ్రా

ABN , First Publish Date - 2020-10-01T09:36:54+05:30 IST

డెన్మార్క్‌ ఓపెన్‌లో కిడాంబి శ్రీకాంత్‌, సైనా నెహ్వాల్‌కు సులువైన డ్రాలు లభించాయి. ఈనెల 13నుంచి జరిగే ఈ పోటీల

శ్రీకాంత్‌, సైనాకు సులువైన డ్రా

న్యూఢిల్లీ: డెన్మార్క్‌ ఓపెన్‌లో కిడాంబి శ్రీకాంత్‌, సైనా నెహ్వాల్‌కు సులువైన డ్రాలు లభించాయి. ఈనెల 13నుంచి జరిగే ఈ పోటీల పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్లో టొబీ పింటి (ఇంగ్లండ్‌)తో తలపడనున్న శ్రీకాంత్‌.. ఆ రౌండ్‌ దాటితే తర్వాతి మ్యాచ్‌లో భారత్‌కే చెందిన శుభాంకర్‌ డేతో పోటీపడే చాన్సుంది. ఆరంభరౌండ్లు అధిగమిస్తే క్వార్టర్స్‌లో అతనికి రెండో సీడ్‌ చౌ తిన్‌ చెన్‌ (తైవాన్‌) ఎదురుపడొచ్చు. మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్లో సైనా నెహ్వాల్‌.... హోయాస్‌ (ఫ్రాన్స్‌)ను ఓడిస్తే రెండో రౌండ్లో స్థానిక క్రీడాకారిణి మియా బ్లిచ్‌ఫెల్ట్‌తో తలపడాల్సి ఉంటుంది.

Updated Date - 2020-10-01T09:36:54+05:30 IST